Maruti Suzuki, Mahindra, Hyundai and Tata Cars Price Increased Before Budget 2023; బుధవారం 2023-24కు సంబందించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ అనంతరం చాలా వస్తువులు చౌకగా లేదా ఖరీదైనవిగా మారాయి. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టకముందే చాలా కార్ల ధరలు పెరిగాయి. గత జనవరిలో చాలా కార్ల తయారీదారు సంస్థలు తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. బడ్జెట్ 2023 సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు, టైర్ల ధరలు పెరిగాయి. దాంతో మరోసారి కార్ల ధరలు పెరుగుతాయా? లేదా? అన్నది ఇంకా తెలియదు. అయితే ఇప్పటికే పెరిగిన కార్ల ధరలను చూద్దాం.
# హ్యుందాయ్ మోటార్ ఇండియా i20 హ్యాచ్‌బ్యాక్ మోడల్ లైనప్ ధరలను రూ. 21,500 వరకు పెంచింది. ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ ధర రూ.7.18 లక్షల నుంచి రూ.10.91 లక్షల మధ్య ఉంది.
# మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV ధరలు రూ. 85,000 వరకు పెరిగాయి. ఇప్పుడు స్కార్పియో S మరియు స్కార్పియో S11 వేరియంట్లు వరుసగా రూ. 12.84 లక్షలు మరియు రూ. 16.14 లక్షలు (ఎక్స్-షోరూమ్)లుగా ఉన్నాయి.
# మహీంద్రా XUV700 ధరలను రూ. 64,000 వరకు పెంచింది. SUV మోడల్ ప్రస్తుతం MX మరియు AX అనే రెండు సిరీస్‌లలో 23 వేరియంట్‌లలో (పెట్రోల్ మరియు డీజిల్) అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.13.45 లక్షల నుంచి రూ.25.48 లక్షల వరకు ఉన్నాయి.
# టాటా మోటార్స్ తన ICE ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరలను 1.2 శాతం వరకు పెంచింది. పెంపు ధర ఫిబ్రవరి 1 నుంచి వర్తిస్తుంది. కంపెనీ Tiago, Altroz, Tigor, Punch, Nexon, Harrier, Safari వంటి కార్లను విక్రయిస్తోంది.
# మారుతీ సుజుకీ ఇటీవల తన కార్ల ధరలను పెంచింది. మోడల్ లైనప్ ధరలు దాదాపు 1.1 శాతం పెరిగాయి. 2023 జనవరి 16 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఆల్టో, వ్యాగన్ఆర్, బాలెనో వంటి ప్రముఖ కార్ల ధరలు పెరిగాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.