Cheap and Best Mobile Phones Under Rs 15000 Budget: మొబైల్ ఫోన్ కొనాలి అనుకున్నప్పుడు చాలామంది ముందుగా నిర్ణయించుకునేది ఆ ఫోన్ కోసం తమ వద్ద ఎంత బడ్జెట్ ఉంది అనే అంశమే. ఉదాహరణకు ఫోన్ కొనే వారి వద్ద రూ. 15 వేలు బడ్జెట్ ఉంటే.. ఆ 15,000 రూపాయల్లోపు వచ్చే చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏమున్నాయా అనే సెర్చ్ చేస్తారు కదా. అలాంటి వారి కోసమే కొన్ని ఫోన్ల వివరాలతో పాటు వాటిలో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటి, అందులో బాగా లేనిది ఏంటనే అంశాలను ఈజీగా అర్థం చేసుకునేలా, వీలైనంత క్లుప్తంగా ఇక్కడ అందివ్వడం జరుగుతోంది. ఆ డీటేల్స్ ఏంటో మీరే చెక్ చేయండి.
ఇన్ఫినిక్స్ నోట్ 30 5G ఫోన్
ఇన్ఫినిక్స్ నోట్ 30 5G ఫోన్ 4GB వేరియంట్ ధర రూ. 14,999 కాగా 8GB RAM + 128GB వేరియంట్ ఫోన్ ధర రూ. 15,999 గా ఉంది.
పాజిటివ్ అంశాలు
పంచీ, 120Hz LCD డిస్ప్లే.
IP53 రేటింగ్.
45W వైర్డు ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది.
క్వాలిటీ సౌండ్ తో స్టీరియో స్పీకర్లు, హెడ్‌ఫోన్ జాక్ లభిస్తున్నాయి.
తక్కువ కాంతిలోనూ మెరుగ్గా ఫోటోలు, వీడియోలు తీసే గుడ్ క్వాలిటీ కెమెరా.
అనేకమైన 5G బ్యాండ్లకు మద్దతు ఇస్తుంది.
నెగటివ్ అంశాలు
సన్‌లైట్‌లో డిస్ప్లే బలహీనంగా ఉండటం.
చిన్న చేతుల్లో ఇమడలేనంత పెద్ద సైజులో ఉండటం.
ఐకూ Z6 లైట్ 5G ఫోన్
ఐకూ Z6 లైట్ 5G ఫోన్ ధర రూ. 13,999 ( 6GB RAM + 128GB మిస్టిక్ నైట్ కలర్ వేరియంట్ ) కాగా 6GB RAM + 128GB స్టెల్లార్ గ్రీన్ కలర్ వేరియంట్ ఫోన్ ధర రూ. 14,499 గా ఉంది.
పాజిటివ్ అంశాలు
గుడ్ పర్ఫార్మెన్స్.
గుడ్ బ్యాటరీ లైఫ్.
120Hz డిస్ప్లే.
మెరుగైన కెమెరా పనితీరు.
ప్రీమియం ఫోన్ డిజైన్ని తలపిస్తుంది.
నెగటివ్ అంశాలు
ఈ ఫోన్‌తో ఛార్జర్ రావడం లేదు. ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
యూజర్ ఇంటర్ఫేస్ కొంత నెమ్మదిగా పనిచేస్తోంది. సాఫ్ట్వేర్ పని తీరు కూడా ఇంకొంత మెరుగ్గా ఉండే బాగుండేది.
4GB RAM వేరియంట్ ఫోన్లో నైట్ మోడ్ లేదు.
5G బ్యాండ్స్‌లో రెండు 5G బ్యాండ్స్‌ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
మోటో G52 ఫోన్
పాజిటివ్ అంశాలు
క్రిస్ప్ LED డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్.
గుడ్ బ్యాటరీ లైఫ్, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
ఆండ్రాయిడ్ 12 సపోర్ట్.
మూడేళ్లపాటు ఆండ్రాయిడ్ సెక్యురిటీ అప్డేట్స్.
నెగటివ్ అంశాలు
కెమెరాల పని తీరు యావరేజ్.
రెడ్మి 11 ప్రైమ్
రెడ్మి 11 ప్రైమ్ ఫోన్ ధర రూ. 12,999 ( 4GB RAM + 64GB) కాగా 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న ఫోన్ ధర రూ. 14999 గా ఉంది.
పాజిటివ్ అంశాలు
డీసెంట్ పర్ఫార్మెన్స్ ఫోన్.
ఏడు 5G బ్యాండ్లకు సపోర్ట్ చేయగలుగుతుంది.
గొరిల్లా గ్లాస్ 3 స్క్రాచ్ ప్రొటెక్షన్‌తో టాల్ డిస్ప్లే ఫీచర్.
గుడ్ బ్యాటరీ లైఫ్.
నెగటివ్ అంశాలు
తక్కువ కాంతిలో ఫోటోల క్వాలిటీ సరిగ్గా లేవు.
సింగిల్ స్పీకర్ సెటప్ మాత్రమే ఉంది.
డిస్ప్లే ఇంకా బ్రైట్‌గా ఉంటే బాగుంటుంది.
రియల్‌మి నార్జో 30 5G ఫోన్
రియల్‌మి నార్జో 30 5G ఫోన్ ధర రూ. 14,999 ( 4GB RAM + 64GB) కాగా 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ ఖరీదు రూ. 17999 గా ఉంది.
పాజిటివ్ అంశాలు
ఎట్రాక్టివ్ లుక్స్‌తో ఎట్రాక్టివ్‌గా కనిపిస్తోంది.
బ్రైట్ అండ్ స్పీడ్లీ రియాక్టింగ్ డిస్ప్లే.
సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్.
నెగటివ్ అంశాలు
నెమ్మదిగా చార్జింగ్ అవడం.
అల్ట్రా వైడ్ కెమెరా లేదు.
మోతాదుకు మించిన ప్రీఇన్స్టాల్డ్ యాప్స్
శాంసంగ్ గెలాక్సీ F22 ఫోన్
శాంసంగ్ గెలాక్సీ F22 ఫోన్ ధర రూ. 11,499 4GB RAM కలిగి ఉండి 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.
పాజిటివ్ అంశాలు
అమోలెడ్ డిస్ప్లే చాలా బాగుంది
స్మూత్ అండ్ ఫ్లూయిడ్ సాఫ్ట్వేర్
అద్భుతమైన బ్యాటరీ లైఫ్
నెగటివ్ అంశాలు
అందించిన ఛార్జర్‌ని ఉపయోగించి స్లో ఛార్జింగ్
ఎన్నో రకాల యాప్స్ ప్రీఇన్‌స్టాల్ చేసి ఉండటం
గేమింగ్ని ఆస్వాదించే స్థాయిలో లేదు
తక్కువ కాంతిలో కెమెరా పనితీరు సరిగ్గా లేదు
రెడ్మి 10S ఫోన్ :
రెడ్మి 10S ఫోన్ ధర రూ. 14,990 6GB RAM కలిగి ఉండి 64GB నుండి 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 64MP ప్రైమరీ సెన్సార్ కెమెరా ఉంది.
పాజిటివ్ అంశాలు
క్రిస్ప్ డిస్ప్లేతో పాటు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.
స్లిమ్ అండ్ లైట్ మొబైల్.
గుడ్ బ్యాటరీ లైఫ్.
సామర్థ్యం కలిగిన ప్రాసెసర్.
నెగటివ్ అంశాలు
కెమెరా పర్ఫార్మెన్స్ యావరేజ్‌గా ఉంది.