Here is Cheapest Electric Scooters List: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తుండడంతో.. నిత్యం ఎన్నో రకాల కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు భారత మార్కెట్లోకి వస్తున్నాయి. పెట్రోల్, డీజీల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో.. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయి. రోడ్లపైన పది వాహనాలలో 3-4 ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. అయితే కొన్ని చౌకైన ఎలక్ట్రిక్ వాహనాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికి వస్తే.. మార్కెట్లో డెడ్ చీప్‌వి అందుబాటులో ఉన్నాయి. ఆ వాహనాలు ఏవో ఓసారి చూద్దాం.
Avon E Scoot:
అవాన్ ఇ స్కూట్ ధర సుమారు రూ. 45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దీని పూర్తి ఛార్జింగ్‌తో 65 కి.మీల ప్రయాణం చేయొచ్చని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం 24KMPH. ఈ స్కూటర్ 215W BLDC మోటార్ మరియు 48V/20AH బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6-8 గంటల సమయం పడుతుంది.
Bounce Infinity E1:
బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1ధర రూ. 45,099 (బ్యాటరీ లేని వేరియంట్) నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ధర రూ.68,999. ఇది 2kWh/48V బ్యాటరీతో వస్తుంది. స్కూటర్ టాప్ స్పీడ్ 65kmph. ఇక 85km ప్రయాణం చేయొచ్చని అని కంపెనీ పేర్కొంది.
Hero Electric Optima CX:
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ (ఒకే బ్యాటరీ వేరియంట్) ధర రూ. 62,190. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 45 KM/H మరియు రేంజ్ 82KM అని కంపెనీ పేర్కొంది. ఇది మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ 51.2V/30Ah బ్యాటరీతో వస్తుంది. 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
Ampere Magnus EX:
ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ స్కూటర్ LCD స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ USB పోర్ట్, కీలెస్ ఎంట్రీ మరియు యాంటీ-థెఫ్ట్ అలారంతో వస్తుంది. ఇది 1.2 kW మోటార్‌తో రన్ అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 55 కి.మీ. ఈ స్కూటర్ 60V, 30Ah బ్యాటరీతో వస్తుంది. మీరు 121 కిమీ ప్రయాణం చేయొచ్చు. ఈ స్కూటర్ ధర రూ.73,999.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Cheapest Electric Scooters: డెడ్ చీప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూ. 45 వేల నుంచి స్టార్ట్! 121 కిమీ ప్రయాణం
డెడ్ చీప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
రూ. 45 వేల నుంచి స్టార్ట్
121 కిమీ ప్రయాణం