How to Use Debit Card: ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ పెరిగిపోయిన నేపథ్యంలో డెబిట్ కార్డుల వినియోగం కొంతవరకు తగ్గిపోయింది. ఎప్పుడో ఒకసారి నగదు విత్ డ్రా కోసం డెబిట్ కార్డును వినియోగిస్తున్నారు. అయితే ఏటీఎంలో డెబిట్ కార్డును ఉపయోగించే సమయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఏ మాత్రం పొరపాటును చేసినా మీ ఖాతా ఖాళీ కావడం ఖాయం. డెబిట్ కార్డుతో లావాదేవీలు చేసేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండకండి.
ముఖ్యంగా కార్డు నంబరు, సీవీవీ, ఓటీపీ వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్‌లైన్ కేటుగాళ్లు కొత్త మార్గాల్లో డబ్బును దోచుకునేందుకు రెడీగా ఉన్నారు. మీరు కొంచెం నిర్లక్ష్యం వహించినా.. గుర్తు తెలియని లింక్స్‌ను క్లిక్ చేసిన క్షణాల్లో మీ అకౌంట్ నుంచి డబ్బులు మాయం అయ్యే అవకాశం ఉంటుంది. డెబిట్ కార్డును భద్రంగా దాచుకునేందుకు మీరు కొన్ని సూచనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.
==> మీ పిన్ నంబరు గుర్తుపెట్టుకోండి. డెబిట్ కార్డ్‌లో గానీ.. మీ పర్సులో గానీ ఎక్కడా రాసిపెట్టుకోవద్దు. పొరపాటున మొబైల్‌లో కూడా పిన్ అని సేవ్ చేసుకోకండి.
==> మీరు డబ్బులను ఎలా భద్రంగా ఉంచుకుంటారో.. కార్డులను కూడా భద్రంగా రక్షించుకోవాలి.
==> ఏటీఎంలలో లావాదేవీ చేస్తున్నప్పుడు రిసిప్ట్ తీసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఎక్కడైనా స్వైపింగ్ మిషన్ల వద్ద లావాదేవీలు చేసినా.. కచ్చితంగా రసీదు తీసుకోండి.
==> మీరు కార్డు పోగొట్టుకున్నా.. లేదా ఎవరైనా ఎత్తుకెళ్లినా వెంటనే బ్యాంక్‌కు నివేదించండి. కార్డును బ్లాక్ చేయమని కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి
==> ఏటీఎంలో లావాదేవీలు చేసేటప్పుడు మీ కార్డుపై నిఘా ఉంచండి. ఏటీఎం కొంతమంది సాయం చేస్తున్నట్లు నటించి.. మీ పిన్ వివరాలను తెలుసుకుని మీ కార్డుతో ఉడాయించే ప్రమాదం ఉంటుంది. మీ కార్డు ఇతరులకు ఇచ్చి లావాదేవీలు చేయకండి.
==> మీరు డెబిట్ కార్డుతో బిల్ పే చేసిన తరువాత అక్కడే కార్డు మర్చిపోకండి. లావాదేవీ సమయంలో అంతరాయం కలిగినా.. వెంటనే బ్యాంక్‌కి కాల్ చేయండి.
==> మరో ముఖ్య విషయం ఏంటంటే.. మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి.
==> అనుమానాస్పదంగా కనిపించే ఏ ప్రదేశంలోనైనా డెబిట్ కార్డ్‌ని స్వైప్ చేయవద్దు.
==> ఆన్‌లైన్‌లో డెబిట్ కార్డుతో లావాదేవీలు చేస్తున్నప్పుడు.. మీ కార్డ్ వివరాలను అస్సలు సేవ్ చేయకండి. వెబ్‌సైట్ సురక్షితంగా ఉందో లేదో ముందు చెక్ చేసుకోండి.
Also Read: PF Withdrawal: పీఎఫ్ నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Debit Card Tips 2023: డెబిట్ కార్డు వాడుతున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి