EPFO Interest Rate 2023: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ)కు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం సోమవారం ఢిల్లీలో ప్రారంభమైంది. రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనుండగా.. మంగళవారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ రేటును ప్రకటించే అవకాశం ఉంది. కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ విషయంపై రేపు క్లారిటీ ఇవ్వనున్నారు. ఈపీఎఫ్ వడ్డీ రేటుపైనే ప్రధానంగా చర్చిలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పెన్షన్ పెంచాలని ఇటీవల డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో అధిక పెన్షన్‌కు సంబంధించిన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
కోట్లాది మంది ఉద్యోగులకు ఈసారి షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌పై వడ్డీ మరింత తగ్గే అవకాశం కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 43 ఏళ్ల తరువాత పీఎఫ్ ఖాతాదారులు అతి తక్కువ వడ్డీ పొందనున్నారని చెబుతున్నారు. ఈసారి వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించే ఛాన్స్ ఉందని వారు పేర్కొంటున్నారు. 2021-22లో వడ్డీరేటు 8.10 శాతం ఉండగా.. ఈ ఏడాది మరింత తగ్గి 8 శాతానికి చేరుకుంటుందని అంటున్నారు.
సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల బేసిక్ శాలరీ నుంచి 12 శాతం ఈపీఎఫ్‌ఓలో జమ చేస్తారు. యజమాని కూడా అదే మొత్తాన్ని జమ చేస్తారు. ఈపీఎఫ్‌ఓలో డిపాజిట్ చేసిన మొత్తం ఉద్యోగుల పదవీ విరమణ, ఇల్లు నిర్మించడం లేదా కొనడం, పిల్లల చదువులు, వివాహం, పదవీ విరమణకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం దాదాపు 6 కోట్ల మంది ఈపీఎఫ్‌ఓ సభ్యులు ఉన్నట్లు సమాచారం.
గతేడాది మార్చి 12న ఈపీఎఫ్ బోర్డు మీటింగ్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఇది 43 సంవత్సరాలలో అతి తక్కువ వడ్డీ రేటు. కార్మిక సంఘాల నుంచి రాజకీయ పార్టీల వరకు ఈపీఎఫ్ రేటు తగ్గింపు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతకుముందు 2020-21లో ఈ రేటు 8.5 శాతంగా ఉంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమర్థించింది. ఏదైనా పెట్టుబడి పథకాలతో పోలిస్తే.. ఈపీఎఫ్‌పై వచ్చే వడ్డీ అత్యధికమని పేర్కొంది. ఈపీఎఫ్ వడ్డీ రేటు 2019-20లో 8.5 శాతం, 2018-19కి 8.65 శాతంగా ఉంది. ఈసారి 8 శాతానికి తగ్గిస్తే.. ఉద్యోగుల నుంచి మరోసారి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
Also Read: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ గ్రేడ్స్ ప్రకటన.. పాండ్యా, జడేజాకు ప్రమోషన్.. ఈ ప్లేయర్లు ఔట్..!
Also Read: Aha New CEO: ఆహా కీలక నిర్ణయం.. కొత్త సీఈఓ నియామకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి