Forbes Ranking: మారిన కుబేరుల జాబితా, మరోసారి అగ్రస్థానానికి చేరిన ఎలాన్ మస్క్, ఫోర్బ్స్ జాబితా

Forbes Ranking: ప్రపంచ కుబేరుల జాబితాలో వారం రోజుల వ్యవధిలోనే మార్పు వచ్చేసింది. టాప్ బిలియనీర్స్ జాబితా మారింది. ఫోర్బ్స్ జాబితాలో ఆ ఇద్దరూ స్థానచలనం పొందారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 28, 2021, 01:29 PM IST
  • ఫోర్బ్స్ జాబితా విడుదల, మరోసారి మారిన ప్రపంచ కుబేరుల జాబితా
  • వారంలోనే అగ్రస్థానంలో దూసుకెళ్లిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్
  • అమెజాన్ షేర్ స్వల్ప పతనంతో రెండవ స్థానంలో నిలిచిన జెఫ్ బెజోస్
Forbes Ranking: మారిన కుబేరుల జాబితా, మరోసారి అగ్రస్థానానికి చేరిన ఎలాన్ మస్క్, ఫోర్బ్స్ జాబితా

Forbes Ranking: ప్రపంచ కుబేరుల జాబితాలో వారం రోజుల వ్యవధిలోనే మార్పు వచ్చేసింది. టాప్ బిలియనీర్స్ జాబితా మారింది. ఫోర్బ్స్ జాబితాలో ఆ ఇద్దరూ స్థానచలనం పొందారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

ఫోర్బ్స్ మేగజైన్(Forbes Magazine)జాబితా అనగానే ప్రపంచ కుబేరుల జాబితా గుర్తొస్తుంది. ఇటీవలే వారం రోజులు కాకుండానే ఫోర్బ్స్ ప్రపంచంలోనే టాప్ ధనవంతుల జాబితా(Forbes Billionaires list) విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రముఖ వ్యాపారవేత్త అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలవగా, రెండవ స్థానంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిలిచారు. ఈ జాబితా విడుదలై ఇంకా వారం కూడా కాలేదు. హఠాత్తుగా ఫలితాలు మారిపోయాయి. ప్రపంచ కుబేరుల స్థానాలు మారిపోవడంతో ఫోర్బ్స్ మేగజైన్ మరో జాబితా విడుదల చేసింది. ఇందులో టస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) మళ్లీ మొదటి స్థానానికి చేరగా..అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్(Jeff Bezos)రెండవ స్థానానికి పరిమితమయ్యారు. టెస్లా ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఎలాన్ మస్క్ టాప్‌లో దూసుకొచ్చారు. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో టాప్ పాయింట్‌కు చేరుకున్న టెస్లా షేర్ల ధరలు(Tesla Share Prices)మళ్లీ పంజుకున్నాయి. సోమవారం 2.2 శాతం పెరుగుదలతో 791.36 డాలర్ల వద్ద మార్కెట్ ముగిసింది. ఫలితంగా ఎలాన్ మస్క్ సంపాదనను మరోసారి నిర్ధారణ చేయగా టాప్‌లో ఉన్నట్టు తేలింది. అతని సంపాదన 3.8 బిలియన్ డాలర్లు పెరగడంతో మొత్తం సంపద విలువ 203.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తాజా జాబితా ప్రకారం ప్రపంచ కుబేరుల్లో తొలి స్థానం ఇప్పుడు ఎలాన్ మస్క్‌ది కాగా, రెండవ స్థానంలో జెఫ్ బెజోస్, మూడవ స్థానంలో బెర్నార్డ్ అర్నాల్డ్, నాలుగవ స్థానంలో బిల్‌గేట్స్, నాలుగవ స్థానంలో మార్క్ జుకర్‌బర్గ్ కొనసాగుతున్నారు. గత కొద్దికాలంగా అమెజాన్ షేర్లు మార్కెట్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి. అటు అమెజాన్ స్టాక్(Amazon Share Value) 0.6 శాతం పడిపోవడంతో బెజోస్ సంపద 197.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో టెస్లా వ్యాపారంలో వృద్ధి నమోదైంది.స్పేస్‌ఎక్స్(SpaceX) ద్వారా నలుగురు సాధారణ వ్యక్తులు అంతరిక్షంలో పంపిన ప్రయోగం విజయవంతం కావడం కూడా టెస్లా షేర్ల పెరుగుదలపై ప్రభావం చూపించింది. ఎలాన్ మస్క్ 2 వందల బిలియన్ డాలర్లను చేరుకున్న మూడవ వ్యక్తిగా నిలిచారు. గతంలో ఈ ఫీట్‌ను జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్డ్ సాధించారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ గత ఏడాది ఆగస్టులోనే ఈ ఫీట్ సాధించగా, ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ మాత్రం గత నెలలో 2 వందల బిలియన్ మార్క్ చేరుకున్నారు. ఇదే ఊపు కొనసాగితే 2025 నాటికి తొలి ట్రిలియనీర్ అంటే 3 వందల బిలియన్ డాలర్లకు ఎలాన్ మస్క్ చేరుకోవచ్చనేది అంచనా. టెస్లా(Tesla Share Value)విలువ 792 బిలియన్‌ డాలర్లుకాగా, స్పేస్‌‌ఎక్స్‌ 74 బిలియన్‌ డాలర్లు ఉంది. ఈ ఏప్రిల్‌లో ఈక్విటీ ఫండింగ్‌ ద్వారా 1.16 బిలియన్‌ డాలర్లు సేకరించగలిగింది. ఇదిలా ఉంటే ఒక్క 2020లోనే మస్క్‌ సంపాదన 720 శాతం పెరిగి.. 125 బిలియన్‌ డాలర్లను తెచ్చిపెట్టింది.

Also read: Indian Economy: 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News