Free Petrol on Indian Oil Bunk by HDFC Bank Credit Card: దాదాపుగా ప్రతి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. భారత్‌లో కూడా పెట్రో మంట మండుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలపై పెను భారంగా మారుతోంది. మరోవైపు ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో.. సామాన్యులు నెలవారీ బడ్జెట్‌లో పొదుపు పాటించక తప్పడం లేదు. పైసా పైసా ఆదా చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 'ఇండియన్ అయిల్ కార్పొరేషన్' ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి సంవత్సరం 50 లీటర్ల పెట్రోల్‌ను ఉచితంగా పొందవచ్చు. ఇండియన్ ఆయిల్ యొక్క 20 వేలకు పైగా పెట్రోల్ పంపుల నుంచి ఈ పెట్రోల్‌ను పొందవచ్చు.
అయితే ఉచిత పెట్రోల్ పొందాలంటే. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాస్తవానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య ఓ ఒప్పందం ఉంది. ఇండియన్ ఆయిల్ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డును మీరు ఉపయోగిస్తే.. పాయింట్‌లను మీరు పొందుతారు. ఆ పాయింట్‌ల ఆధారంగానే మీరు ఉచిత పెట్రోల్ పొందవచ్చు. కార్డు హోల్డర్ ప్రతి నెలా పొందగలిగే గరిష్ట ఇంధన పాయింట్ల ఆధారంగా.. ప్రతి సంవత్సరం 50 లీటర్ల వరకు ఉచిత పెట్రోల్ పొందగలుగుతారు.
# ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కార్డ్‌తో మీ ఖర్చులలో 5% ఆదా చేసుకోవచ్చు. మొదటి ఆరు నెలల్లో నెలకు గరిష్టంగా 250 ఫ్యూయల్ పాయింట్‌లు, తర్వాతి ఆరు నెలల్లో నెలకు గరిష్టంగా 150 ఫ్యూయల్ పాయింట్‌లు పొందవచ్చు.
# కిరాణా షాపింగ్ మరియు ఏదైనా బిల్ చెల్లింపుపై 5 శాతం ఇంధన పాయింట్లు మీ ఖాతాలో చేరుతాయి. షాపింగ్, బిల్ చెల్లింపు రెండింటిలోనూ నెలకు గరిష్టంగా 100 ఇంధన పాయింట్లు చేరుతాయి. ఐతే వీటికి కనీసం రూ.150 లావాదేవీ చేయాల్సి ఉంటుంది.
# ఏ రకమైన షాపింగ్ చేసినా.. రూ.150కి 1 ఫ్యూయెల్ పాయింట్ పొందుతారు.
# 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు కూడా ఉంటుంది. ఇందుకోసం మీరు కనీసం రూ.400 లావాదేవీలు జరపాలి.
# 'IndianOil XTRAREWARDS' (XRP) పాయింట్లను పొందడానికి ఇంధన పాయింట్లను (FP) రీడీమ్ చేసుకోవచ్చు. XRPకి బదులుగా మీరు భారతదేశం అంతటా 20,000 కంటే ఎక్కువ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపుల వద్ద ఉచిత ఇంధనాన్ని పొందవచ్చు. గరిష్టంగా 50 లీటర్లు (సంవత్సరంలో) వరకు ఉచితంగా పొందవచ్చు.
Also Read: Shah Rukh Khan: అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితా.. భారత్ నుంచి 'ఒకే ఒక్కడు' కింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.