IRCTC Booking: భారతీయ రైల్వే టికెట్స్ ను ఆన్ లైన్ లో IRCTC వెబ్ సైట్ లో పొందవచ్చు. ఇందులో నెలకు దాదాపుగా 6 సార్లు టికెట్స్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో ఎక్కువ సార్లు రైలు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. లేదా మన ఇంట్లో వాళ్ల కోసం బుక్ చేయాల్సిన అవసరం రావొచ్చు. అలాంటి క్రమంలో నెలకు 12 సార్లు టికెట్ బుక్ చేసుకోవడానికి ఓ మార్గం ఉంది.
IRCTC వెబ్ సైట్ లో ఖాతా ఉన్న వాళ్లు తప్పనిసరిగా తమ ఆధార్ KYC ని పూర్తి చేసుకొని.. ఈ సేవలను పొందవచ్చు. నెలకు 6 కంటే ఎక్కువ సార్లు రైలు టికెట్లను బుక్ చేసేందుకు ఆధార్ KYC తప్పనిసరిగా మారింది. KYC చేసే సమయంలో ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు OTP వస్తుంది. దాన్ని వెబ్ సైట్ లో ఎంటర్ చేయడం ద్వారా KYC పూర్తి అవుతుంది.
ఒక నెలలో 6 రైల్వే టికెట్స్ కంటే ఎక్కువ బుక్ చేయాల్సిన క్రమంలో.. ప్రయాణించే వారిలో కనీసం ఒక ప్రయాణికుడి ఆధార్ కార్డు ద్వారా ధ్రువీకరించాలి. అయితే ఈ క్రమంలో IRCTC వెబ్ సైట్ లో ఆధార్ KYC చేయడం ఎలానో తెలుసుకుందాం.
1) ముందుగా www.irctc.co.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
2) అందులో మీ ఖాతాకు లాగిన్ చేసి సైన్ ఇన్ అవ్వాలి.
3) 'My Account' ఆప్షన్ లోకి వెళ్లి.. 'లింక్ యువర్ ఆధార్' ఎంచుకోండి.
4) ఇప్పుడు అందులో ఆధార్ KYC కనిపిస్తుంది. అందులో మీ ఆధార్ వివరాలను నమోదు చేసి.. 'send OTP' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
5) మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లో మీరు OTP అందుకున్న తర్వాత నమోదు చేయండి.
6) ఆధార్ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి అప్‌డేట్ బటన్‌ను క్లిక్ చేయాలి.
7) దీంతో మీ ఆధార్ కార్డు KYC ప్రక్రియను పూర్తి చేసినట్లు అవుతుంది.
Also Read: Amazon Tecno Pop 5 LTE: రూ.9 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను రూ.349లకే కొనేయండి!
Also Read: Indian Railways Concession: సీనియర్ సిటిజన్స్ కు గుడ్ న్యూస్.. రైలు ప్రయాణాలపై రాయితీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook