Ban Work From Home: హైదరాబాద్‌లో విచిత్ర డిమాండ్‌.. వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ తొలగించాలని ధర్నా

Local Businessmans Protest Against Work From Home At Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం ఎత్తివేయాలని కొందరు ధర్నాకు దిగారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో తాము నష్టపోతున్నట్లు వాపోయారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 27, 2024, 04:56 PM IST
Ban Work From Home: హైదరాబాద్‌లో విచిత్ర డిమాండ్‌.. వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ తొలగించాలని ధర్నా

Work From Home Protest: కరోనా తర్వాత ఇంటి నుంచే పని విధానం సంస్కృతి పెరిగిన విషయం తెలిసిందే. ఇంటి నుంచి పని చేయడం విధానం అనేది కంపెనీలకు కొన్ని లాభాలు, నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు కరోనా ప్రభావం లేకున్నా ఖర్చులు తగ్గుతాయనే ఉద్దేశంతో అదే విధానం కొనసాగిస్తోంది. దీంతో ఇంకా సాఫ్ట్‌వేర్‌ రంగం వర్క్‌ ఫ్రమ్‌ విధానం అమలు చేస్తోంది. కానీ దీని ప్రభావం ఇతరులపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా చాలా వ్యాపారాలను దెబ్బతీసింది. ఉద్యోగులు కార్యాలయాలకు వస్తేనే తమ వ్యాపారాలు కొనసాగుతాయి. ఇంకా వర్క్‌ ఫ్రమ్‌ విధానం అమలవుతుండడంతో వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో తాజాగా ధర్నాకు దిగారు. వర్క్‌ ఫ్రమ్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది.

Also Read: Kavitha Bail: కవితపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

 

మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో చాలా ఐటీ సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో వేలాది మంది ఉద్యోగాలు చేస్తుంటారు. కరోనా తర్వాత పోచారం ప్రాంతం బోసిపోయింది. అయితే క్యాంపస్‌ ఉండడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున హాస్టల్స్‌, మెస్‌లు, హోటళ్లు, టీ స్టాళ్లు తదితర వ్యాపారాలు ఉన్నాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఆ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కొనసాగుతుండడంతో మంగళవారం పోచారంలో వ్యాపారులు ఆందోళన చేశారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు.

Also Read: Akbaruddin Owaisi: బుల్లెట్లతో నన్ను కాల్చండి.. నా కాలేజ్‌ను కాదు: అక్బరుద్దీన్‌ సంచలనం

 

ఈ సందర్భంగా ఇన్ఫోసిస్‌ క్యాంటీన్ సంఘం నాయకుడు మాట్లాడారు. '2020 ఏప్రిల్ నుంచి 2024 ఆగస్టు వరకు వర్క్ ఫ్రం హోం కొనసాగుతుంది.. కొవిడ్ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం హాస్టల్స్, క్యాంటీన్స్‌ను తిరిగి తెరిచాం. కానీ ఇంకా వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ కొనసాగుతుండడంతో మేం తీవ్రంగా నష్టపతున్నాం. పోచారం ఇన్ఫోసిస్‌ను నమ్ముకుని ఎంతోమంది జీవనం పొందుతున్నారు. వర్క్ ఫ్రం హోమ్‌తో మాకు తీవ్ర నష్టం వస్తోంది' అని ఆవేదన వ్యక్తం చేశారు.

'క్యాంటీన్ యజమానులు, ఆటో యూనియన్లు, మెస్‌లు, టీ స్టాళ్లు వంటి వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతున్నారు' అని క్యాంటీన్‌ సంఘం వాపోయింది. ఇకనైనా ఇన్ఫోసిస్ యజమాన్యం వర్క్ ఫ్రం హోమ్‌ విధానం రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. వెంటనే వర్క్ ఫ్రం ఆఫీస్‌ను అమలు చేయాలని కోరారు. ధర్నాలో ఐటీ పారిడార్ అసోసియేషన్, బిల్డింగ్స్ యజమానులు, హాస్టల్స్‌ యజమానులు, హోటల్‌ నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News