Twitter Blue Tick: ట్విట్టర్ యూజర్లకు షాక్, ఇకపై బ్లూటిక్ మరింత ప్రియం

Twitter Blue Tick: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విట్టర్ మరోసారి షాక్ ఇచ్చింది. బ్లూ టిక్ యూజర్లు ఇకపై ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక తప్పదు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విట్టర్..బ్లూటిక్ ధరను పెంచేసింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 19, 2023, 04:52 PM IST
Twitter Blue Tick: ట్విట్టర్ యూజర్లకు షాక్, ఇకపై బ్లూటిక్ మరింత ప్రియం

ట్విట్టర్ యూజర్లకు షాక్ ఇది. మీరు ట్విట్టర్ యూజర్ అయి ఉండి..బ్లూ టిక్ ఉంటే ఈ వార్త మీకే వర్తిస్తుంది. ఇక నుంచి మీరు బ్లూటిక్ కోసం ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది. బ్లూటిక్ ధరను ట్విట్టర్ పెంచేసింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఇక నుంచి ప్రతి నెలా 11 డాలర్లు అంటే 894 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 

ఇప్పటి వరకూ ఉన్న ధర ఎంత

మొన్నటి వరకూ ట్విట్టర్ బ్లూటిక్ యూజర్లకు నెలకు 8 డాలర్లు అంటే 650 రూపాయలు లేదా ఏడాదికి 84 డాలర్లు లేదా 6830 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఈ సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ ట్విట్టర్ బ్లూతో పాటు బ్లూటిక్ కూడా లభించేది. బ్లూటిక్ కోసం పేమెంట్ చేసిన ప్రతి యూజర్‌కు వెరిఫికేషన్ టిక్ వచ్చేది.

ఏయే దేశాల్లో అమలు

ఈ ప్లాన్ ప్రస్తుతం అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో అమలు చేస్తున్నారు.

నోటీసు లేకుండా తొలగిపోతుంది బ్లూ టిక్

ఒకవేళ ట్విట్టర్ విధించే సర్వీస్ కండీషన్స్‌ను ఉల్లంఘిస్తే లేదా మీ ఖాతా సస్పెండ్ చేసుంటే ఏవిధమైన రిఫండ్ ప్రతిపాదన లేకుండా ఎప్పుడైనా సరే బ్లూటిక్ తొలగించే అధికారం ట్విట్టర్‌కు ఉంటుంది.

కొత్త సేవ ప్రారంభం

మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విట్టర్ ప్రకారం సంస్థల కోసం ట్విట్టర్ వెరిఫికేషన్ పేరుతో కొత్త సేవ ప్రారంభిస్తోంది. ఇది ట్విట్టర్‌పై వ్యాపార సంస్థలకు పనికొచ్చే ఒక సర్వీస్. దీని ప్రకారం అధికారిక వ్యాపార ఖాతాలకు గోల్డ్ టిక్ ఉంటుంది.

ఇతర ప్రయోజనాలు

బ్లూటిక్‌తో పాటు ట్విట్టర్ బ్లూ ఫీచర్ అనేది యూజర్లకు ట్విట్టర్ గురించి మరింత మెరుగైన, అద్భుతమైన అనుభవాన్నిస్తుంది. ఇందులో కస్టమ్ యాప్ ఐకాన్, కస్టమ్ నేవిగేషన్, హేడర్, అన్‌డూ ట్వీట్, పెద్ద వీడియోలు ఉంటాయి.

Also read: Tata Group: 18 ఏళ్ల తరువాత టాటా గ్రూప్ నుంచి మరో ఐపీవో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News