Maruti Electric SUV: భారతీయ కార్ మార్కెట్‌లో మారుతి కంపెనీ స్థానం చాలా ప్రత్యేకం. దేశంలో అత్యధికంగా విక్రయమయ్యే కార్లలో ఎప్పుడూ మారుతి కార్లే ముందుంటాయి. మోడల్ ఏదైనా జనాన్ని అమితంగా ఆకర్షిస్తుంటుంది. ఇప్పుడందరి దృష్టి మారుతి లాంచ్ చేయనున్న తొలి ఈవీ కారుపైనే ఉంది.
ఇండియాలో మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కారు eVX త్వరలో లాంచ్ చేయనుంది. ఇప్పటికే 2023 ఆటో ఎక్స్‌పోలో దీనిపై ఫోకస్ చేసింది. మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీను 2024 దీవాళి నాటికి లాంచ్ చేయవచ్చని సమాచారం. ఆ తరువాత మారుతి ఇతర మోడల్ కార్లు గ్రాండ్ విటారా, జిమ్మి, ఫ్రాంక్స్, బలేనో, వేగన్ ఆర్‌లలో ఈవీ వెర్షన్ లాంచ్ చేయనుంది.
హ్యుండయ్ క్రెటా ఈవీతో పోటీ
మారుతి ఈవీఎక్స్ ఎస్‌యూవీ మార్కెట్‌లో హ్యుండయ్ క్రెటా ఈవీకు పోటీ ఇవ్వనుంది. హ్యుండయ్ కంపెనీ త్వరలో క్రెటా ఈవీ వెర్షన్ లాంచ్ చేయనుంది. 2025 ప్రారంభంలో లాంచ్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. మారుతి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ గురించి పరిశీలిస్తే..ఇందులో ఎల్ఎఫ్‌పి బ్లెడ్‌సెల్ 60 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
గుజరాత్ రాష్ట్రంలోని వినిర్మాణ్ ప్లాంట్‌లో మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు తయారు కానుంది. ఈ మోడల్ కారు 4300 మిల్లీమీటర్ల పొడవు, 1800 మిల్లీమీటర్ల వెడల్పు, 1600 మిల్లీమీటర్ల వెడల్పు ఉంటుంది. హ్యుండయ్ క్రెటా ఈవీ కూడా ఇదే పరిమాణంలో ఉంటుంది. ఈ కారు వీల్ బేస్ 2700 ఎంఎం ఉండవచ్చు. ఇప్పటి వరకూ కేవలం కాన్సెప్ట్ వెర్షన్ మాత్రమే లాంచ్ అయింది. ఇంకా చాలా దశలు మిగిలున్నాయి.
మారుతి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు డిజైన్
Maruti eVX ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ వెర్షన్‌లో బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, వీ షేప్డ్ హెడ్ ల్యాంప్స్, పొడుగైన బానెట్, ముందుభాగంలో ఫ్లాట్ నోస్, వంటి ఫీచర్లు ఉన్నాయి. స్లోపింగ్ రూఫ్‌లైన్, పెద్ద వీల్ ఆర్చ్, సైడ్ క్లోడింగ్, షార్ట్ ఓవర్ హేంగ్స్, హై గ్రౌండ్ క్లియరెన్స్, రెక్డ్ రేర్ విండ్ స్క్రీన్ ఉన్నాయి.
Also read: Debit Card Tips 2023: డెబిట్ కార్డు వాడుతున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
2023 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ చేసిన కాన్సెప్ట్ వెర్షన్ ఆధారంగానే ఈ ప్రత్యేకతలు వివరాలు తెలుస్తున్నాయి. అంటే ఈ ఫీచర్లు అన్ని కేవలం అంచనా మాత్రమే. పూర్తిగా లాంచ్ చేశాక కొద్దిగా అటూ ఇటూ మారవచ్చు.
Also read: Cheapest 7 Seater: అత్యంత చౌకైన 7 సీటర్ కారు ఇదే , ధర కేవలం 6.3 లక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Maruti Electric SUV: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్ ఎప్పుడు , ఆ కారు ప్రత్యేకతలు