/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Money Saving on Home Loan Repayment: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్లు పెంచింది. రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయంతో రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. వరుసగా పెరుగుతూ వస్తోన్న రెపో రేటు లోన్స్ పై వడ్డీ రేటు పెరగడానికి కారణమవుతోందనే విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణంతో వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు పెంచుతూ పోవడం రుణగ్రహీతలపై మరింత వడ్డీ భారాన్ని పడేలా చేస్తోంది. ఫలితంగా నెలవారీ ఇఎంఐలు కూడా పెరుగుతున్నాయి.

రీఫైనాన్స్
మీ క్రెడిట్ స్కోర్‌ బాగా మెరుగ్గా ఉన్నట్లయితే మీరు తక్కువ వడ్డీ రేటు కోసం మీరు లోన్ తీసుకున్న బ్యాంకును రిక్వెస్ట్ చేయవచ్చు. ఒకవేళ మీరు NBFCల (నాన్-బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ) నుండి లోన్ తీసుకున్నట్లయితే, మీపై రుణభారం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీకు లోన్ ఇచ్చిన బ్యాంకు నుంచి ఆ రుణాన్ని మరో బ్యాంకుకు మార్చి రీఫైనాన్స్ చేయడం ద్వారా వడ్డీ తగ్గింపు రూపంలో కొంత రుణ భారం తగ్గించుకోవచ్చు. ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇతర అదనపు ఖర్చులు వర్తించినప్పటికీ.. కాలక్రమంలో మీరు వడ్డీపై ఆదా చేసే డబ్బు అంతకంటే ఎక్కువే ఉంటుంది అనే విషయం మర్చిపోవద్దు.

5 శాతం ఇఎంఐ పెంచుకోండి
మీ లోన్ మొత్తాన్ని ఎక్కువ కాలంపాటు చెల్లించి వడ్డీ రూపంలో ఎక్కువ డబ్బును బ్యాంకులకు సమర్పించుకోవడం కంటే.. నెలా నెలా మీకు వీలైనంతలో ఇంకొంత ఎక్కువ మొత్తాన్ని ఇఎంఐ రూపంలో చెల్లించడం ద్వారా వడ్డీ రూపంలో నష్టపోయే మొత్తాన్ని మీరు ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు 20 ఏళ్లపాటు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రతీ నెల 5 శాతం ఇఎంఐ పెంచుకుని చెల్లించడం ద్వారా ఆ రుణాన్ని మరో ఏడేళ్లు ముందుగానే ముగించారనుకోండి.. ఆ ఏడేళ్లపాటు రుణంపై చెల్లించే వడ్డీ మీకు ఆదా అవుతుంది.

సంవత్సరానికి ఒక ఇఎంఐ ఎక్కువ 
ప్రతి నెల కుదరని పక్షంలో ప్రతీ సంవత్సరంలో ఒకసారి అదనపు ఇఎంఐ చెల్లించడం అనేది మరొక పద్ధతి. అలా చేయడం ద్వారా, మీరు మీ వడ్డీ చెల్లింపులను తగ్గించుకోవడంతో పాటు 20 ఏళ్ల పాటు చెల్లించాల్సిన రుణాన్ని సుమారు 17 సంవత్సరాలలోపే పూర్తిగా రీపేమెంట్ చేయవచ్చు.

గడువు కంటే ముందే పూర్తిగా చెల్లించడం
హౌజింగ్ ఫైనాన్స్‌ని వీలైనంత త్వరగా ప్రీ-క్లోజ్ చేసుకోవడం వల్ల రుణంపై ఎక్కువ కాలం పాటు వడ్డీ చెల్లించే భారాన్ని తప్పించుకోవచ్చు. హోమ్ లోన్స్ తీసుకునే వారిలో చాలామందికి ఇది సాధ్యపడకపోవచ్చు. అయితే, వీలైనంత వరకు చెల్లించాల్సినదానికంటే ముందుగానే రుణం మొత్తం చెల్లించడమే మంచి పద్ధతి. లేదంటే కొన్ని సందర్భాల్లో తీసుకున్న అసలు రుణం కంటే రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది అని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Gold ATM: హైరాబాద్‌లో గోల్డ్ ఏటీఎం.. ప్రపంచంలోనే ఫస్ట్ గోల్డ్ ఏటీఎం

 

ఇది కూడా చదవండి : New Cars Prices Increasing: కొత్తగా కారు కొంటున్నారా ? ఐతే ఇది మీకోసమే

ఇది కూడా చదవండి : Train Ticket Charges: రైలు టికెట్లపై రాయితీలు నిజమేనా ? లేక ఊహాగానాలా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Section: 
English Title: 
money saving tips, how to save money on your home loan emi repayment
News Source: 
Home Title: 

Home Loan Repayment: ఇంటి రుణం చెల్లింపు భారం కాకుండా ఉండాలంటే ఇలా చేయండి

Home Loan Repayment: ఇంటి రుణం చెల్లింపు భారం కాకుండా ఉండాలంటే ఇలా చేయండి
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

హోమ్ లోన్ రీపేమెంట్ ఎలా చేస్తే డబ్బు ఆదా అవుతుందో తెలుసా ?

అధిక వడ్డీ భారం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ?

రీపేమెంట్ విషయంలో ఎలాంటి పద్ధతులు అవలంభిస్తే మనీ సేవ్ చేయొచ్చు ?

హోమ్ లోన్స్ తీసుకున్న వారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mobile Title: 
Home Loan Repayment: ఇంటి రుణం చెల్లింపు భారం కాకుండా ఉండాలంటే ఇలా చేయండి
Pavan
Publish Later: 
No
Publish At: 
Tuesday, December 13, 2022 - 11:39
Request Count: 
61
Is Breaking News: 
No