ATM Transactions: ఫిబ్రవరి 1 నుంచి ఆ ట్రాన్సాక్షన్స్ చేయలేరు

Restricting Transactions From Non EMV ATM Machines From 1 February, 2021: భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI). ఎస్‌బీఐ తరువాత రెండో అతిపెద్ద ప్రభుత్వ  బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB). ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ఏటీఎం రూల్స్, నగదు విత్‌డ్రా పరిమితితో పాటు ఎన్నో అంశాలలు మారిపోయాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 19, 2021, 04:32 PM IST
  • భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • ఎస్‌బీఐ తరువాత రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్
  • ఫిబ్రవరి 1 నుంచి పీఎన్‌బీ నిర్ణయం తీసుకున్న కొత్త రూల్ అమలులోకి
ATM Transactions: ఫిబ్రవరి 1 నుంచి ఆ ట్రాన్సాక్షన్స్ చేయలేరు

Restricting PNB Account Holders Transactions From Non EMV ATM Machines: భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI). ఎస్‌బీఐ తరువాత రెండో అతిపెద్ద ప్రభుత్వ  బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB). ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ఏటీఎం రూల్స్, నగదు విత్‌డ్రా పరిమితితో పాటు ఎన్నో అంశాలలు మారిపోయాయి. తాజాగా పీఎన్‌బీ కీలక నిర్ణయం తీసుకుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ ఖాతాదారులు నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్ల నుంచి నగదు డ్రా చేయడం వీలు కాదు. ఫిబ్రవరి 1 నుంచి పీఎన్‌బీ నిర్ణయం తీసుకున్న కొత్త రూల్ అమలులోకి రానుంది.  ఏటీఎం(ATM) మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంక్ కస్టమర్ల నగదు భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.

Also Read: ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ

నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్ల ద్వారా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు నిలిపివేస్తున్నట్లు పీఎన్‌బీ బ్యాంకు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి నాన్ ఈఎంవీ ఏటీఎం కేంద్రాల నుంచి పీఎన్‌బీ(Punjab National Bank) ఖాతాదారులు నగదు విత్‌డ్రా చేసే వీలుండదు. అయితే ఖాతాదారులు ముందుగా ఏటీఎం కార్డుల రకాలు, ఏటీఎం మెషీన్ల రకాల గురించి తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

Also Read: Cheapest Recharge Plan: కేవలం రూ.2కే 1 GB డేటా, కాల్స్.. ప్లాన్ వివరాలు

 

ఈఎంవీ, నాన్ ఈఎంవీ ఏటీఎం అంటే?

ఏటీఎం కేంద్రానికి వెళ్లిన తర్వాత కొన్ని ఏటీఎం కేంద్రాలో ఒక్కసారి కార్డ్ ఇన్‌సర్ట్ చేసి వెనక్కి తీసుకుంటే ఆ ఏటీఎంలను నాన్ ఈఎంవీ ఏటీఎంలు అని అంటారు. ఇలా కాకుండా మీ ఏటీఎం కార్డును మెషీన్లో పెట్టి ట్రాన్సాక్షన్ పూర్తయ్యే వరకు అలాగే ఉంచాల్సిన ఏటీఎంలను ఈఎంవీ ఏటీఎం అంటారు. సాధారణంగా మన కార్డు మీద ఉన్న మాగ్నటిక్ స్ట్రిప్ మీద ఉన్న వివరాలను ఏటీఎం మెషీన్ రీడ్ చేసి డేటా చెక్ చేస్తుంది.

Also Read: EPFO: ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను UMANG Appలో ఈజీగా చెక్ చేసుకోండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News