Jio Annual Plans: రిలయన్స్ జియో ప్రీపెయిడ్ కేటగరీలో సరికొత్త ఆఫర్లు అందిస్తోంది. కొత్త వార్షిక ప్లాన్స్ ద్వారా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్, జీ5 వంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. రిలయన్ జియో అందిస్తున్న ఈ కొత్త వార్షిక ప్లాన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం..
జియో వార్షిక ప్లాన్స్ వివరాలు
జియో 3662 రూపాయల ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ డేటా అందుతుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ 5జి డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్ తీసుకుంటే అదనంగా సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇది కాకుండా జియో క్లౌడ్, జియో సినిమా, జియో టీవీ ఉచితంగా పొందవచ్చు.
జియో 3226 రూపాయల ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. దాంతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ 5జి డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుంటుంది. దీంతోపాటు సోనీ లివ్, జియో సినిమా, జియో క్లౌడ్, జియో టీవీ ఉచితంగా లభిస్తాయి. ఇక జీ5 అయితే జియో టీవీ యాప్ ద్వారా చూడవచ్చు.
జియో 3225 రూపాయల ప్లాన్ ఇంచుమించుగా జియో 3226 ప్లాన్ లాంటిదే. ఇది కూడా రోజుకు 2 జీబీ డేటా అందిస్తుంది. అన్ లిమిటెడ్ 5జి డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. వ్యాలిడిటీ 365 రోజులుంటుంది. ఇక జీ5, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఉచితం. దీంతోపాటు సోనీలివ్ ఏడాదిపాటు ఉచితంగా చూడవచ్చు.
జియో 3178 రూపాయల ప్లాన్ కూడా 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ పొందవచ్చు. అంతేకాకుండా జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమాతో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచితంగా వీక్షించవచ్చు.
జియో 2545 రూపాయల ప్లాన్ కూడా 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దాంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్, అన్‌లిమిటెడ్ 5జి డేటా ఉంటాయి.
Also read: Reliance Jio: మీకు నచ్చిన వీఐపీ నెంబర్ కేవలం 499 రూపాయలకు పొందే అద్భుత అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook