UPI Transactions limit: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ లావాదేవీలపై పరిమితి విధించింది. రోజువారీ చెల్లింపుల్ని నియంత్రించింది. రోజుకు ఒక వ్యక్తి 1 లక్ష రూపాయల వరకే చెల్లింపులు జరపడానికి వీలుంటుంది. అంతకుమించి పేమెంట్ జరపలేము.
దేశంలో గత కొద్దికాలంగా ఆన్లైన్ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న చిన్న వీది వెండర్లు కూడా ఆన్లైన్ పేమెంట్లు తీసుకుంటున్న పరిస్థితి. చిన్న చిన్న మొత్తాల నుంచి పెద్దమొత్తం వరకూ అంతా ఆన్లైన్ నడుస్తోంది. ఆఖరికి 10 రూపాయలైనా సరే యూపీఐ ద్వారా చెల్లించే పరిస్థితి ఉంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐకు ఆదరణ పెరుగుతోంది. అయితే చాలామందికి యూపీఐ ద్వారా రోజుకు ఏ మేరకు చెల్లింపులు జరపవచ్చనేది తెలియదు. దేశంలో అన్ని రకాల యూపీఐ చెల్లింపుల్ని నియంత్రించేది, పర్యవేక్షించేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే. యూపీఐ లావాదేవీలపై పరిమితి విధించింది. రోజుకు 1 లక్ష రూపాయల వరకు ఓ వ్యక్తి యూపీఐ చెల్లింపులు జరపగలడు. అదే వ్యాపార లావాదేవీలైతే రోజుకు 2 లక్షల వరకూ చేయవచ్చు.
మరోవైపు షేర్ మార్కెట్ కొనుగోళ్లలో ఐపీవో బుక్ చేసేందుకు లేదా కొనుగోలు చేసేందుకు రోజుకు 5 లక్షల వరకూ పరిమితి ఉంది. గత ఏడాది డిసెంబర్ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యాసంస్థలు, ఆసుపత్రులకు యూపీఐ చెల్లింపుల పరిమితిని 5 లక్షలకు పెంచింది.
ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి యూపీఐ లావాదేవీలు 1 లక్ష రూపాయల వరకూ చేయవచ్చు కానీ బ్యాంకును బట్టి పరిమితి మారుతుంటుంది. కొన్ని బ్యాంకులు వేరే పరిమితి విధించుకున్నాయి. గరిష్టంగా లక్ష రూపాయలు లావాదేవీ జరిపేందుకు వీలున్నా 10 లావాదేవీలు దాటకూడదనే నిబంధన కొన్ని బ్యాంకుల విషయంలో ఉంది.
Also read: NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ వాయిదా, తిరిగి ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook