When Will Be EPFO Interest credited : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లోకి వారికి రావాల్సిన వడ్డీ డబ్బులు జమ అవడం మొదలైంది. ప్రస్తుతానికి కొన్ని ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో మాత్రమే వడ్డీ జమ కాగా .. ఆగస్టు నెల ముగిసేలోగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారుల అందరి ఖాతాల్లోకి వడ్డీ జమ అవనున్నట్టు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓలో సంబంధిత విభాగం నుండి ఆమోదం పొందిన ఖాతాల్లో వడ్డీ డబ్బు డిపాజిట్ అవుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో ఉన్న మొత్తంపై 8.15% వడ్డీ రేటుతో వడ్డీ డబ్బు జమ చేయనున్నట్టు ఇటీవలే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో ఉన్న డబ్బులపై నెలవారీ ప్రాతిపదికన వడ్డీ లెక్కించి వార్షిక ప్రాతిపదికన జమ చేయడం జరుగుతుంది. ఖాతాల్లో డబ్బు జమ అయిన వారు ఈపీఎఫ్ఓ పాస్ బుక్ ఓపెన్ చేసి చెక్ చేయొచ్చు. ఈపీఎఫ్ఓ చట్టాన్ని పరిశీలిస్తే, బేసిక్ శాలరీ ప్లస్ డిఏలోంచి 12% మీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదే మొత్తానికి సమాన మొత్తం కంపెనీ వైపు నుండి కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో డిపాడిట్ చేయడం జరుగుతుంది. కంపెనీ చేసిన కంట్రిబ్యూషన్లోంచి 3.67 శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ కానుండగా మిగతా 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ పథకంలో జమ చేయడం జరుగుతుంది.
అధిక వడ్డీ ప్రయోజనం
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ ఖాతాపై 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15% వడ్డీ రేటు చొప్పున డబ్బులు జమ కానున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.10 శాతంగా ఉండగా.. ఈ ఏడాది ఆ వడ్డీ రేటును 8.15 శాతానికి పెంచారు. సేవింగ్స్ ఖాతాలపై, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలపై, సీనియర్ సిటిజెన్స్‌కి బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ అందించే వడ్డీ రేట్ల కంటే ఇదే అత్యధికం.
ఇది కూడా చదవండి : Top Electric Cars in India: ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితా
పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంపై వడ్డీ లభించదు
ప్రావిడెంట్ ఫండ్‌లో డిపాజిట్ అయిన మొత్తం డబ్బులపై వడ్డీ వస్తుందని ఖాతాదారులు భావిస్తుంటారు. కానీ వాస్తవానికి అలా జరగదు. ఈపీఎఫ్ ఖాతాలో జమ అయ్యే పెన్షన్ ఫండ్ పై వడ్డీని జోడించరు.
ఇది కూడా చదవండి : Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డు లిమిట్ భారీగా కట్ అయిందా ? ఐతే రిస్కే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి