Atiq Ahmed: లోక్‌సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్‌ను హత్యపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. హత్యకు కారణమైన నిందుతులు ఎవ్వరైన వదిలి పెట్టేది లేదన్నారు. ఈ హత్యలపై విచారణకు త్రి సభ్య కమిటీని ఏర్పటు చేస్తున్నట్లు యోగి ప్రభుత్వం పేర్కొంది.
పోలీసుల సమాచారం మేరకు.. వైద్య పరీక్షల నిమిత్తం అతిక్ అహ్మద్, అష్రఫ్‌లను ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలేజీకి తీసుకుని వెళ్లే క్రమంలో ముగ్గురు గుర్తులు తెలియని వ్యక్తులు జర్నలిస్టుల ముసుగులో వచ్చి అతిక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడుపై కాల్పులు జరిపారని పేర్కోన్నారు. ఇంతక ముందే ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అతిక్ అహ్మద్ కుమారుడిని ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అష్రాఫ్ అహ్మద్ తన కుమారి అంత్యక్రియల్లో పాల్గొన్నాడం వల్ల కొంత అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆయనను వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ తీసుకువెళ్లే క్రమంలో రాత్రి 10:30 గంటలకు ఈ ఘటన జరిగిందని స్పెషల్ డీజీ తెలిపారు.
ఈ ఘటన క్రమంలో పోలీసులు దూరంగా వెళ్లిపోయారు. ఇదే క్రమంలో అతిక్ అహ్మద్, అతని సోదరుడిపై గుర్తు తెలియని దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే ఇంతలోనే వారు ఒక్కసారిగా కప్పకూలి పోయి అక్కడిక్కడే మరణించారు. ప్రయాగ్ రాజ్ పోలీసులు కాల్పులకు పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను గుర్చించి ఘటన స్థలంలోనే అదుపులో తీసుకున్నారు.
Also Read: Jio Cinema Charges: జియో సినిమాకు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే.. ఐపీఎల్ 203 మాత్రం..!
ఘటనపై యూపీ సీఎం స్పందన:
పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం జరగకుండా కాపాడాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పోలీసులే దగ్గరుండి చూసుకోవాలని సీఎం ఆదేశించారు. ఘటన ప్రదేశంలో భద్రతను కూడా పెంచాలని పోలీసులకు తెలిపారు.
144 సెక్షన్ అమలు:
ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఇప్పటికే పలు చర్యలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 144 సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అంతేకాకుండా యూపీలోని అయోధ్య, మౌ, మధుర తదితర ప్రధాన జిల్లాల్లో పోలీసు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
Also Read: Jio Cinema Charges: జియో సినిమాకు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే.. ఐపీఎల్ 203 మాత్రం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.