Hyderabad police Issued A strong warning to social media reels: కొంత మంది యువత ఇటీవల రీల్స్ పిచ్చిలో ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోవాలని నానాతంటాలు పడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ లు, మెట్రోలు, ఎయిర్ పోర్టులో ఇలా ప్రతిచోట తమ రీల్స్ పైత్యం చూపిస్తున్నారు. చుట్టుపక్కల ఎవరున్న కూడా మాకేంటి అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. రన్నింగ్ బైకుల మీద ఇష్టమున్నట్లు రీల్స్, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో చాలామంది తమకు తాముగా హీరోలుగా భావిస్తున్నారు.
— @Coreena Enet Suares (@CoreenaSuares2) August 23, 2024
ఈ నేపథ్యంలో కొంత మంది పిచ్చి పీక్స్ కు చేరింది. కొండ ప్రాంతాలు, జలపాతాలు, ఎత్తైన ప్రదేశాలలో కూడా రీల్స్ తీసుకుంటూ తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. మరికొందరు రీల్స్ చేసుకుంటూ జనాలచెవుల్లో పువ్వులు సైతం పెడుతున్నారు. కొంత మంది రీల్స్ తీసుకుంటూ ఫెమస్ అవ్వడానికి ఎంతకైన తెగిస్తున్నారు. దీనిపైన తాజాగా... హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. ఇక మీదట పబ్లిక్ ప్రదేశాల్లో రీల్స్ తీసుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తే కేసులను నమోదుచేస్తామంటూ కూడా హెచ్చరించారు.
పూర్తి వివరాలు..
ఇటీవల హైదరాబాద్ లో యూట్యూబర్ హర్ష (మహాదేవ్) అనే యువకుడు రీల్స్ చేస్తు పైత్యం చూపించాడు. కూకట్ పల్లిలోని అనేక ప్రాంతాలలో డబ్బులు వెదజల్లుతూ హల్ చల్ చేశాడు. దీంతో ఇది కాస్త వైరల్ కావడంతో వివాదాస్పదమైంది. దీనిపైన కూకట్ పల్లిపోలీసులు కేసు నమోదు చేశారు. హర్ష అనే యూట్యూబర్ ను కూకట్‌పల్లి పోలీసులు శుక్రవారం సాయంత్రం అదుపులోనికి తీసుకున్నారు.
Read more: Royal bengal Tiger: రాయల్ బెంగాల్ టైగర్ తో యువతి చెలగాటం.. ఒళ్లుగగుర్పొడిచే ఘటన.. వీడియో వైరల్..
ఇలాంటి పిచ్చి వీడియోలు చేస్తూ.. పబ్లిసిటీ కోసం పాకులాడే వారికి పోలీసులు శుక్రవారం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట నగరంలో పబ్లిక్ ప్రదేశాలలో రీల్స్, వీడియోలు తీసుకుంటూ పబ్లిక్ లకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తిస్తే..కేసులు నమోదు చేస్తామంటూ హైదరాబాద్ పోలీసులు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై.. BNS 292,125తో పాటు పలు సెక్షన్ల కేసులు నమోదు చేస్తామంటూ కూడా ధమ్కీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook