2.5 Crores Wasted Due to NTR Brahmastra Pre Release Event cancellation: బాలీవుడ్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందిన బ్రహ్మాస్త్ర అనే సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. రణబీర్ కపూర్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాలో షారుక్ ఖాన్, అమితాబచ్చన్, నాగార్జున, మౌని రాయ్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్ సహా మరికొన్ని బ్యానర్లు సంయక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల చేస్తున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా దర్శక ధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ భారతదేశ చరిత్రలోనే మన పెన్నడూ చేయని విధంగా ఘనంగా జరపడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ అనూహ్య కారణాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేకపోయారు. ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాము పర్మిషన్ ఇవ్వండి అంటూ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్న శ్రేయాస్ మీడియా సంస్థ ఆగస్టు 25వ తేదీన రాచకొండ కమిషనరేట్ కు ఒక లేఖ ద్వారా అభ్యర్థన పంపింది. 26వ తేదీన ఆ లేఖ అనుకున్నట్లుగా కమిషనరేట్ నుంచి వారికి సమాచారం అందడంతో పాటు ఒక ఇన్స్పెక్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న ప్రాంగణానికి వచ్చి చేయాల్సిన మార్పులు చేర్పులు కూడా సూచించారు.
ఇక అంతా బాగానే ఉంది సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది అనుకుంటే హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఇప్పుడు పోలీసు బందోబస్తు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పంపడం కుదరదు అంత మంది జనాన్ని పోలీసులు లేకుండా కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేము అంటూ చివరి నిమిషంలో పోలీసులు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా పిలిపించుకుని మాట్లాడడమే ఇదంతా జరగడానికి కారణమని కొంతమంది విశ్లేషణలు వినిపిస్తున్నారు. కెసిఆర్ సర్కారు బీజేపీ మీద తీవ్రస్థాయిలో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో అమిత్ షా తో భేటీ అయిన ఎన్టీఆర్ సభకు మనం ఎలా పర్మిషన్ ఇస్తామని భావించి వారు చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా ఆ ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయినా సరే సుమారుగా రెండున్నర కోట్ల రూపాయలు ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోయాయని తెలుస్తోంది. సుమారు 50 లక్షల రూపాయల మేర బాణాసంచాకే ఖర్చు పెట్టారని, హైదరాబాదులోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ గా దీనిని ప్లాన్ చేశారని కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయడంతో సుమారు రెండున్నర కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయాయి అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ అక్కడే నిర్వహించాలని యూనిట్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
కాబట్టి రెండున్నర కోట్ల రూపాయలు నిజంగా వేస్ట్ అయ్యాయా లేదా అనేది కొన్నాళ్లలో తెలుస్తుంది. అయితే బాలీవుడ్ సినిమాలు వరుసగా బయటకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న క్రమంలో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నిజంగా డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంటే అప్పుడు నిజంగానే రెండున్నర కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోతాయి. ఈవెంట్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో పార్క్ హయత్ లో అప్పటికప్పుడు సినిమా యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. అప్పటికప్పుడు పార్క్ హయత్ లో మీటింగ్ ఏర్పాటు చేసేందుకు సుమారు పది లక్షల రూపాయలు ఖర్చయ్యాయట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి