Naatu Naatu Won Oscar : నాటు నాటుకు ఆస్కార్.. బాలీవుడ్ మౌనం.. నోరు విప్పని సల్మాన్, ఆమిర్, షారుఖ్, అక్షయ్

Bollywood Silence on Naatu Naatu Won Oscar బాలీవుడ్ బడా హీరోలంతా ఇప్పుడు షెడ్డుకు వెళ్లినట్టుగా ఉన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల ఏ ఒక్క బాలీవుడ్ హీరో సైతం స్పందించలేదు. సల్మాన్, షారుఖ్, ఆమీర్, అక్షయ్ వంటి వారు నోరు మెదపడటం లేదు. సోషల్ మీడియా వేదికగా స్పందించడం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2023, 12:52 PM IST
  • ఆస్కార్ అవార్డు కొల్లగొట్టిన నాటు నాటు
  • ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన టాలీవుడ్
  • ఆస్కార్ అవార్డుపై బాలీవుడ్ మౌనం
Naatu Naatu Won Oscar : నాటు నాటుకు ఆస్కార్.. బాలీవుడ్ మౌనం.. నోరు విప్పని సల్మాన్, ఆమిర్, షారుఖ్, అక్షయ్

Bollywood Silence on Naatu Naatu Oscar Award నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై దేశ ప్రధాని మోదీ సైతం స్పందించాడు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించారు. ఆర్ఆర్ఆర్ టీంను అభినందించారు. కానీ బాలీవుడ్ నుంచి మాత్రం ఏ ఒక్క స్టార్ హీరో కూడా స్పందించలేదు. సోషల్ మీడియాలో కనీసం ఓ పోస్ట్ కూడా వేయలేదు. ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి బడా హీరోలు నోరు మెదపడం లేదు.

ముందు నుంచి కూడా మన సౌత్ ఆధిపత్యాన్ని బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. ఇక చేసేదేం లేక అన్నట్టుగా అక్కడి వాళ్లు కూడా మన హీరోలు, దర్శక నిర్మాతలతో టై అప్ అవుతున్నారు. ఇక్కడి మార్కెట్ మీద వాళ్లు ఫోకస్ పెడుతున్నారు. అయితే పఠాన్ సినిమాతో మళ్లీ బాలీవుడ్‌కు ఊపిరి వచ్చినట్టు అయింది. వాళ్లు బాహుబలి, కేజీయఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాల సక్సెస్‌ను జీర్ణించుకోలేకపోతోన్నట్టుగా కనిపిస్తోంది.

నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చిందనే వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. కానీ ఈ బాలీవుడ్ బడా హీరోలకు ఇంకా ఈ విషయం తెలిసినట్టుగా లేదు. అన్ని విషయాలకు సోషల్ మీడియాలో స్పందించే షారుఖ్ ఖాన్ సైతం ఇంత వరకు ట్వీట్ వేయలేదు. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండే షారుఖ్ సైతం నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరంగా మారింది.

ఇక సల్మాన్, ఆమిర్ ఖాన్ వంటి వారు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండరు. అక్షయ్ కుమార్ అప్పుడప్పుడు అంటే తనకు అవసరమైన సందర్భాల్లో మాత్రమే ట్వీట్లుగానీ, పోస్టులుగానీ పెడుతుంటాడు. అయితే షారుఖ్ ఖాన్ ఇది వరకే ఓ సారి ఆస్కార్ గురించి మాట్లాడాడు. రామ్ చరణ్ ఆస్కార్ తన ఇంటికి పట్టుకొస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. అలా ఆస్కార్ ఇంటికి వస్తే నన్ను తాకనివ్వు అని సరదాగా అన్నాడు. 

మరి ఆ ఆస్కార్ ఇప్పుడు వస్తే అభినందించడానికి చేతులు ముందుకు రావడం లేదా? అని అనిపిస్తోంది. మొత్తానికి బాలీవుడ్ మాత్రం ఇప్పుడు తన ద్వేషాన్ని, కక్షను ఇలా ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. సాయంత్రం వరకైనా బాలీవుడ్ బడా హీరోలు ఆస్కార్ అవార్డు రావడంపై స్పందిస్తారా? లేదా? అన్నది చూడాలి.

Also Read:  Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు

Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News