Actor Ali Double Ismart: రాజకీయాలకు విరమణ ప్రకటించిన సినీ నటుడు అలీ ఇప్పుడు పూర్తిగా సినిమాలకు పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే డబుల్ ఇస్మార్ట్ సినిమాలో అలీ ప్రత్యేకంగా కనిపించాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన ఈ సినిమాతో అలీ ఇక సినిమాలతోనే బిజీగా ఉండనున్నట్లు స్పష్టమైంది. మరికొన్ని సినిమాల్లో నటించనున్నాడు. రాజకీయాలకు దూరమైన అతడు ఇప్పుడు సినిమాలతో ప్రేక్షకులకు చేరువ కానున్నాడు.
Also Read: Double iSmart: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ విడుదల.. ఎంటర్టైన్మెంట్ డబుల్.. అంచనాలు కూడా డబుల్..!
విభిన్నమైన కథతో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో అలీ ప్రత్యేక పాత్రలో కనిపించారు. చూడడానికి కోతి రూపంలో అలీ ప్రత్యేక పాత్రలో ఉన్నారు. ఆ పాత్రలో అలీ అచ్చం కోతిలా నటించాడు.
Also Read: Rajamouli: బాహుబలిలో అలాంటి తమన్నా సీన్స్ అందుకే పెట్టాము.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఒక ప్రత్యేకమైన భాషలో ఆ పాత్రలో అలీ కనిపించి ఆకట్టుకున్నాడు. 'ఏయ్ లావడె' అంటూ అలీ ట్రైలర్‌లో కనిపించాడు. ఆ తర్వాత అలీ పాత్రను చూసి 'నువ్వు మనిషివా కోతివా' అని వేరే పాత్ర ప్రశ్నిస్తుంది. 'మసత్రో లుంజా' అని ఏదో తెలియని భాషలో మాట్లాడాడు. అలీ పాత్ర సినిమాలో ప్రత్యేకంగా ఉందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
రాజకీయాల్లో ఆశించి భంగపడి
సీనియర్ హాస్య నటుడిగా ఉన్న అలీ 400కు పైగా సినిమాలు చేశాడు. బాల నటుడిగా నటా జీవితం ప్రారంభించిన అలీ అనంతరం హీరోగా.. కమెడియన్‌గా మారాడు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించాడు. మొదట టీడీపీకి మద్దతుదారుగా కనిపించగా.. కాంగ్రెస్‌కు కొంతకాలం దగ్గరైన అలీ వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నన్నాళ్లు అలీ రాజకీయాల్లో కొనసాగారు. ఏపీ ప్రభుత్వంలో పదవి కూడా పొందారు.
అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని అలీ చాలా ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవి ఆశించినా అవకాశం రాలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓడిపోవడంతో అలీ కూడా రాజకీయాలు దూరమయ్యారు. ఈ క్రమంలో తిరిగి సినిమాల్లోకి రంగ ప్రవేశం చేశారు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా నటించగా.. ఇంకొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. ఇక రాజకీయాలను వదిలేసి సినిమాలతోనే బిజీగా ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter