Actress Madhavi latha complain on jc prabhakar reddy: న్యూ ఇయర్ వేళ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేకమంటూ ఒక ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. అయితే.. దీనిపై నటి మాధవీలత స్పందించారు. రాత్రి పూట మహిళలు వెల్లడం అంత సేఫ్ కాదని అన్నారు. రాత్రి పూట జరగరానిది ఏదైన జరిగితే ఎవరు బాధ్యులని దయచేసి వెళ్లొద్దని కూడా మహిళలకు ముందు జాగ్రత్తలు చెప్పారు. అయిన కూడా.. అక్కడి మహిళలు న్యూ ఇయర్ లో రాత్రి పూట ఈవెంట్ కు వెళ్లి ఫుల్ఎంజాయ్ చేశారు.
ఇదిలా ఉండగా.. దీనిపై జేసీ మరుసటి రోజు .. మాధవీలతపై నోరు పారేసుకున్నారు. ఆమె ఒక వేశ్య అంటూ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ వాళ్లకు ఎవరు దొరకలేదా.. ఆమెను పెట్టుకున్నారని కూడా ఇష్టమున్నట్లు వ్యక్తిత్వ హననంకు పాల్పడ్డారు. ఈ ఘటన వివాదస్పదంగా మారింది. దీనిపై నటి మాధవీలత మాట్లాడారు. దీనిపై ఎంతదూరమైన వెళ్తానన్నారు. చావడానికి సైతం సిద్దమన్నారు.
ఇంతలో జేసీ యూటర్న్ తీసుకుని.. ఏదో వయస్సులో పెద్దొడ్ని.. నోరు జారానని.. సారీ అని మాట మార్చారు. పెద్ద మనస్సుతో వదిలేయాలన్నారు. ఆ తర్వాత నటి మాధవీలత సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు. ఒక వీడియో రిలీజ్ చేశారు.
Read more: Hyderabad: ఇండస్ట్రీలో షాకింగ్.. మహిళపై అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారం..
తాజాగా.. నటి జేసీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. జేసీ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. జేసీ.. తనపై.. మూవీ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనపై ఆరోపణలు చేశాక.. అస్సలు కనీసం మా.. దీన్ని ఖండించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన దీనిపై తగిన విధంగా స్పందించాలని మాధవీలత మా కు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో మరోసారి జేసీ వర్సెస్ మాధవీలత వివాదం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter