Samantha Defamation Case: నాగ చైతన్య మరియు సమంత విడాకుల ప్రకటన చేసే సమయంలోనే.. "మా ఇద్దరీ వ్యక్తిగత విషయాల గురించి గానీ, పర్సనల్ లైఫ్ విషయాల గురించి గానీ మీడియా, అభిమానులు & సోషల్ మీడియాలో మాకు భంగం కలిగించేలా ఎలాంటి ప్రచారాలు చేయొద్దని కోరారు".
కానీ కొన్ని సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్లో సమంతను టార్గెట్ చేస్తూ చాలా రూమర్స్ వచ్చాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ సమంత సోషల్ మీడియాలో "ఇలా వ్యక్తిగత దాడి చేయటం సరికాదని, ఇంకోసారి ఇలాంటి పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చింది.
Also Read: India Vs Pakistan Match History: గెట్ రెడీ ఫర్ హై ఓట్లేజ్ మ్యాచ్.. బల్బులు పగలాల్సిందే!
అయితే సుమన్ టీవీ (Suman TV), తెలుగు పాపులర్ టీవీ (Telugu Popular TV), టాప్ తెలుగు టీవీ (Top Telugu TV) లతో పాటు సీఎల్ వెంకట్రావుపై (CL Venkat Rao) కూకట్‌పల్లి కోర్టులో తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టారని సమంత పిటిషన్ దాఖలు చేసిన విషయం మన అందరికీ తెలిసిందే!
తన క్లయింట్ సమంత పిటిషన్ పై త్వరగా యాక్షన్ తీసుకోవాలని, సెలబ్రెటీపై తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సమంత తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ సమంత తరపు న్యాయవాది ప్రతివాదాలకు నోటీసులు పంపించని కారణంగా పిటిషన్ ను తిరస్కరించటమే కాకుండా, కోర్టు ముందు అందరు సమానమే.. సామాన్యులైన.. సెలబ్రెటీలైన న్యాయస్థానం ముందు అందరు ఒక్కటే అని స్పష్టం చేశారు. కోర్టు ముగిసే ముందు విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది.
Also Read: Epsilon Variant Found in Pakistan: పాకిస్తాన్‌లో ప్రమాద ఘంటికలు.. బయటపడ్డ 7 కొత్త మ్యూటేషన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook