Shruti Haasan tests positive for COVID-19: స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ (Actress Shruti Haasan) కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. "నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. తిరిగి ఎప్పటిలాగే నా పనుల్లో పాల్గొనాలని చూస్తున్నా. మిమ్మిల్ని త్వరలోనే మళ్లీ కలుస్తా" అని శ్రుతి పేర్కొంది ఆమె త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆమె ప్రభాస్ 'సలార్' (Salaar), బాలయ్య 107వ సినిమాలోనూ నటిస్తున్నారు. శ్రుతి ఇటీవల నటించిన వెబ్ సిరీస్ 'బెస్ట్ సెల్లర్' (Bestseller) ఫిబ్రవరి 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. శ్రుతి తండ్రి, దిగ్గజ నటుడు కమల్‌హాసన్ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా 10,273 కేసులు (Corona Cases in India) నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 20,439 మంది రికవరీ అయ్యారు. వైరస్ తో 243 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.0శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 1,11,472 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 177,44,08,129 టీకా డోసులు పంపిణీ చేశారు.
Also Read: Russia Ukraine Conflict: ఇండియాపై కూడా ఆ ప్రభావం.. ఇంధన ధరలు భారీగా పెరిగే ఛాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook