Aha app Crashes : ప్రభాస్ దెబ్బకు ఆహా అవుట్.. డార్లింగా మజాకా?

Aha app Crashes ఆహా యాప్ ప్రస్తుతం పని చేయడం లేదు. ప్రభాస్ అభిమానులు దెబ్బకు ఆహా క్రాష్‌ అయింది. ఒకే సారిగా లక్షల మంది డార్లింగ్ అభిమానులు ఆహా యాప్ మీద పడ్డట్టుగా ఉన్నారు. దీంతో ఆహా భరించలేకపోయింది. దీంతో క్రాష్‌ అయినట్టుగా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2022, 10:04 PM IST
  • ఆహాలో ప్రభాస్ ఎపిసోడ్
  • డార్లింగ్ అభిమానుల దెబ్బ
  • క్రాష్‌ అయిన ఆహా యాప్
Aha app Crashes : ప్రభాస్ దెబ్బకు ఆహా అవుట్.. డార్లింగా మజాకా?

Aha app Crashes డార్లింగ్ ప్రభాస్ అభిమానులు అంతా కూడా ఆహా యాప్‌ మీద ఒకేసారి పడ్డారు. నేటి రాత్రి తొమ్మిది గంటల నుంచి ప్రభాస్ ఎపిసోడ్‌ను ప్రీమియర్ చేద్దామని చూశారు. అయితే ఒక్కసారిగా అభిమానులు ఆహా యాప్‌ మీదకు వచ్చినట్టున్నారు. ఒక్కసారిగా ఆ లోడ్‌ను ఆహా తట్టుకోలేకపోయింది. దీంతో ఆహా షట్ డౌన్ అయినట్టుంది. ఆహా యాప్‌ కూడా కొంత మందికి ఓపెన్ అవ్వడం లేదు. దీంతో ఆహా టీం వెంటనే స్పందించింది.

 

ఒకే సారి మన డార్లింగ్ ఫ్యాన్స్ ఆహా యాప్‌కు రావడం వల్ల కాస్త సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని, త్వరలోనే దాన్ని ఫిక్స్ చేసి ఎపిసోడ్‌ను ప్రీమియర్ చేస్తామని ఆహా టీం ట్వీట్ వేసింది. అయితే ఆహా యాప్‌లో ప్రభాస్ ఎపిసోడ్ చూసేందుకు అభిమానులు మాత్రం ఫుల్ ఆకలితో ఎదురుచూస్తున్నట్టుగా కనిపిస్తోంది. అసలే ప్రభాస్ ఇలాంటి షోలకు ఎప్పుడూ వచ్చింది లేదు. అందుకే ఇలా ప్రభాస్‌ను తీసుకొచ్చిన ఆహా టీం.. అనుకున్నట్టుగానే హైప్ పెంచుకుంది.

ఆహా తాజాగా ప్రభాస్‌ను క్రేజ్ పెంచుకుంది. ఆ నెక్ట్స్ పవన్ కళ్యాణ్‌తో ఎపిసోడ్ ప్లాన్ చేసింది. ఇక ప్రభాస్ ఎపిసోడ్‌ను రెండు పార్టులుగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి పార్ట్ నేటి రాత్రి నుంచి వచ్చే అవకాశం ఉంది. రెండో పార్ట్ జనవరి 6న రాబోతోంది. ఇక పవన్ కళ్యాణ్‌ ఎపిసోడ్ అయితే సంక్రాంతి స్పెషల్‌గా వచ్చే చాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఆ ఎపిసోడ్‌తో రెండో సీజన్ ముగుస్తుందని అంతా అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read : Chiranjeevi : పెద్దరికం అనుభవించాలని లేదు!.. ఇండస్ట్రీ పెద్దపై మరోసారి చిరు కామెంట్స్

Also Read : Spyder Agnyaathavaasi Losses : స్పైడర్, అజ్ఞాతవాసి నష్టాలు.. వేరే వాళ్లు అయితే సూసైడ్ చేసుకునేవాళ్లట.. దిల్ రాజు కామెంట్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News