US election: అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల్లో భారతీయులది ప్రతి సంవత్సరం కీలకపాత్రగా మారిపోతుంది. ఈ సంవత్సరం ఏకంగా భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి కమల హారిస్ పోటీలో ఉండటం అనేది ఈసారి రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధం చేసింది. అటు ట్రంప్, కమలా హారిస్ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనే దానిపైన ఉత్కంఠత నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 16 కోట్లకు పైగా ఓటర్లు ఉన్న అమెరికాలో 21 లక్షల మంది భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులకు ఓటు హక్కు ఉంది.
మొత్తం ఓట్లతో పోల్చి చూస్తే తక్కువ సంఖ్య అయినప్పటికీ వీరు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారనేది మాత్రం సత్యం. ఎందుకంటే ఇరు నేతల మధ్య సర్వేల్లో వస్తున్న వివరాల ప్రకారం. పోటాపోటీగా ఎన్నికల పోరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అరశాతం ఓటింగ్ అటు ఇటు టర్న్ అవుట్ అయిన అధికారం భరించే అవకాశం ఉంటుంది. దీంతో అటు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు భారతీయ మూలాలు కలిగిన ఓటర్ల కోసం గాలం వేస్తున్నారు. అయితే భారతీయులు ఎటువైపు ఉన్నారో పలు సర్వేలు చెబుతున్నాయి వాటి వివరాలు చూద్దాం. అలాగే ఎవరు గెలుస్తే మెజారిటీ భారతీయ అమెరికన్లకు లాభం అని భావిస్తున్నారో తెలుసుకుందాం.
కమలా హారిస్ గెలిస్తే భారతీయులకు కలిగే లాభం ఇదే :
సాధారణంగా భారతీయ మూలాలు కలిగిన అమెరికన్లు ఎక్కువగా డెమోక్రాట్ల వైపే ఉంటారు. గత రెండు ఎన్నికల్లో ఇదే సంగతి గమనించవచ్చు. అందుకే కమలా హారిస్ పట్ల దాదాపు 60% పైగా భారతీయ అమెరికన్లకు అనుకూలత ఉన్నట్లు, పలు సర్వేల్లో తేలింది. ముఖ్యంగా కమలహరిస్ గెలుపు వల్ల అమెరికా వలస విధానంలో ప్రస్తుతం ఉన్నట్టుగానే కాస్త ఉదారంగా కొనసాగుతుంది. తద్వారా ఎక్కువ మొత్తంలో హెచ్ వన్ బి వీసాలు, ఇతర ఇమిగ్రేషన్ కు సంబంధించిన విషయాల్లో మేలు జరుగుతుందని భారతీయ అమెరికాను భావిస్తున్నారు.
ట్రంప్ గెలిస్తే భారతీయులకు కలిగే లాభం ఇదే :
గతంతో పోల్చి చూస్తే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పట్ల భారతీయ అమెరికన్ల మద్దతు పెరిగింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో కేవలం 30 శాతం మంది మాత్రమే భారతీయ అమెరికన్లు ట్రంప్ వైపు ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ఆ సంఖ్య 40% వరకు పెరిగింది. భారతీయ మూలాలు కలిగిన వ్యాపారులు సైతం రిపబ్లికన్ పార్టీకి పెద్ద ఎత్తున ఫండింగ్ ఇస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం అమెరికా ఉన్న మాంద్యం పరిస్థితుల నుంచి ట్రంప్ విధానాల వల్ల మేలు జరుగుతుందని తద్వారా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం తగ్గుతుందని, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని పెద్ద ఎత్తున భారతీయ అమెరికన్లు సైతం భావిస్తున్నారు.
కమలా హారిస్ గెలిస్తే భారతీయులకు కలిగే నష్టం ఇదే :
నిజానికి డెమోక్రట్ పార్టీ పట్ల భారతీయ అమెరికన్ లకు మొదటి నుంచి కూడా సానుకూలత ఉంది. దీని ప్రధాన కారణం డెమోక్రట్ పార్టీ విధానాల్లో ఎక్కువగా వలసదారులకు అనుకూలంగా విధానాలు ఉంటాయి. తద్వారా పెద్ద మొత్తంలో వీసాలు జారీ చేయించుకోవడం వంటి పనులకు, డెమొక్రటిక్ పార్టీ విధానాలు తోడ్పడతాయి. అయితే కమలహరిస్ పట్ల ఆమె పార్టీ ప్రస్తుతం అమెరికా ఆర్థిక స్థితిని మెరుగుపరిచే విధంగా ప్రయత్నాలు చేయడం లేదని వ్యతిరేకత ఉంది. తద్వారా ఉద్యోగాల కల్పన జరగడంలేదని అసంతృప్తి కూడా ఉంది. అయితే ఇది సామాన్యంగా అమెరికాలో అందరిలో కూడా ఉన్న అభిప్రాయమే భారతీయ అమెరికన్లలో ప్రతిబింబిస్తోంది, అంతకుమించి కమలహరిస్ వల్ల ప్రత్యేకంగా భారతీయ అమెరికాలోకి వచ్చే నష్టం ఏమీ లేదు అని. నిపుణులు పేర్కొంటున్నారు.
ట్రంప్ గెలిస్తే భారతీయులకు జరిగే నష్టం ఇదే :
నిజానికి ట్రంప్ విధానాలు మొదటి నుంచి కూడా వలసదారులకు వ్యతిరేకంగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఆయన బాహటంగానే పలుమార్లు భారతీయులను, మెక్సికన్లు, ఇతర దేశాలకు చెందిన వలసదారులను పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. వలసదారుల వల్ల అమెరికా అభివృద్ధి చెందినప్పటికీ, రిపబ్లికన్ పార్టీ మొదటి నుంచి కూడా అమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పాటు, ఇతర అన్ని కారణాలకు వలసదారులే కారణమని నెగిటివ్ ప్రచారం చేస్తుంది.
అంతేకాదు హెచ్1బి వీసాల విషయంలోనూ, ఇతర ఇమ్మిగ్రేషన్ పాలసీ విధానాల్లోనూ ట్రంప్ సర్కారు కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది తద్వారా భారతీయులకు అమెరికా వీసా అనేది కష్టతరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది పలు భారతీయ కంపెనీలకు నష్టదాయకం. అలాగే అక్కడ నివసించే భారతీయులకు కూడా వీసా గడువు పొడిగించుకోవడానికి గేట్లు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. తద్వారా వారి ఉద్యోగాలకు గండి పడే అవకాశం ఉంటుందని భయం చాలామందిలో ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: Gold News Today: తగ్గేదెలే అంటున్న బంగారం..82 వేలు దాటిన తులం పసిడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?