OMG 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న అక్ష‌య్‌కుమార్ 'ఓ మై గాడ్ 2' మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Akshy Kumar new Movie:  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్ నయా మూవీ ఓ మై గాడ్ 2. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2023, 12:13 PM IST
OMG 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న అక్ష‌య్‌కుమార్ 'ఓ మై గాడ్ 2' మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Omg 2 OTT Release Date: అక్ష‌య్‌కుమార్‌(Akshy Kumar), పంక‌జ్ త్రిపాఠి, యామీగౌత‌మ్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ఓ మై గాడ్ 2. అమిత్ రాయ్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమా 2012లో వచ్చిన ఓ మై గాడ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'గోపాల గోపాల' పేరుతో రీమేక్ చేశారు. ఇందులో వవన్ కల్యాణ్, వెంకటేష్ లీడ్ రోల్స్ లో నటించారు. ఫస్ట్ పార్ట్ లో కృష్ణుడిగా కనిపించిన అక్షయ్‌ కుమార్‌.. పార్ట్-2లో శివుడిగా కనిపించాడు. తొలి భాగంలో నాస్తికుడిగా పరేశ్‌ రావల్‌ కనిపిస్తే.. రెండో భాగంలో పంకజ్‌ త్రిపాఠి (Pankaj Tripathi) నటిస్తున్నాడు. ఆగ‌స్ట్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ ద్వారానే అక్షయ్ కుమార్ తిరిగి విజయాల బాట పట్టాడు. వాకావ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది.

రిలీజ్ కు ముందే ఈ మూవీ ఎన్నో వివాదాలను ఎదుర్కోంది. ఈ చిత్రానికి సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికి బోర్డు నిరాక‌రించింది.ఈ మూవీకి 25కుపైగా కట్స్ చెప్పింది. వివాదాలు తలెత్తకూడనే విషయంపై శివు డిపాత్రలో కనిపించని అక్షయ్ పేరును మెసేంజ‌ర్ ఆఫ్ గాడ్‌గా సీబీఎఫ్‌సీ సూచించింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం విశేషం. సెన్సార్ బోర్డు మార్పులు చేయ‌డంపై చిత్ర యూనిట్ బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు గుప్పించింది. శివుడి పాత్రలో అక్ష‌య్‌కుమార్ క‌నిపించ‌డంపై కొన్ని వ‌ర్గాల వారు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ సినిమాను ప్ర‌ద‌ర్శ‌న‌ను నిలిపివేయాలంటూ డిమాండ్‌ చేశారు. 

తాజాగా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫిక్స్ దక్కించుకుంది. అక్టోబ‌ర్ 8 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మంగ‌ళ‌వారం నెట్‌ఫ్లిక్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. ఓ మై గాడ్ 2 కు ముందు అక్ష‌య్‌కుమార్‌ న‌టించిన బ‌చ్చ‌న్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్‌, రామ్‌సేతుతో పాటు ఎనిమిదికిపైగా సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి.

Also Read: Mad Trailer: ఎన్టీఆర్ చేతుల మీదుగా 'మ్యాడ్' ట్రైల‌ర్‌.. ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News