Allu Aravind On Chiranjeevi: చిరంజీవితో విభేదాలపై అల్లు అరవింద్ సీరియస్.. పద్ధతేనా అంటూ?

Allu Aravind Opens up on Disturbances with Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ఏర్పడిన విభేదాల గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 5, 2022, 05:21 PM IST
Allu Aravind On Chiranjeevi: చిరంజీవితో విభేదాలపై అల్లు అరవింద్ సీరియస్.. పద్ధతేనా అంటూ?

Allu Aravind Opens up on Disturbances with Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ కుటుంబాల మధ్య దూరం పెరిగింది అనే వాదన చాలా రోజుల నుంచి జరుగుతోంది. అయితే ఈ వాదన ప్రారంభం కావడానికి ముఖ్య కారణం మాత్రం కొణిదెల ప్రొడక్షన్స్ ఆవిర్భావం అని చెప్పక తప్పదు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ అవి తనకు సెట్ కావు అని సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి సినిమా కోసం రామ్ చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్స్ అనే ప్రొడక్షన్ సంస్థ స్థాపించి తానే నిర్మాతగా మారి సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు.

అప్పటివరకు మెగాస్టార్ చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చిన గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ ఈ విషయంలో మనస్థాపం చెందారని అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని వాదన ఉంది. అయితే ఇందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గానీ రెండు కుటుంబాలకు చెందిన వారు ఎప్పటికప్పుడు అది నిజం కాదని చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల అల్లు రామలింగయ్య శత దినోత్సవ వేడుకల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.

అంతేకాక ఆయన పేరిట ఏర్పాటు చేసిన అల్లు స్టూడియోస్ కూడా చిరంజీవి చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే ఇంత జరుగుతున్నా ఇంకా వీరిద్దరి మధ్య ఏదో జరగడానికి జరిగిందని ప్రచారం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ విషయాన్ని నేరుగా కమెడియన్ అలీ అల్లు అరవింద్ ను ప్రశ్నించారు. ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా అనే ఒక షో తాజా ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్లో అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ తాను సుమారు 20కి పైగా సినిమాలలో అల్లు రామలింగయ్య గారి కుమారుడిగా నటించానని అనంటే, అంటే ఇప్పుడు వాటా కోసం ఏమి రావడం లేదు కదా అంటూ అల్లు అరవింద్ ఛలోక్తులు విసిరారు. అలాగే మీరు తెలివైనవారు అని అల్లు రామలింగయ్య అనుకున్నారా? అని ప్రశ్నిస్తే మా నాన్నగారు నేను తెలివైన వాడిని అనుకునేవారని అందుకే నాకు 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆయన ఆర్థిక సలహాలు నా నుంచి తీసుకునే వారిని చెప్పుకోచ్చారు అరవింద్.

ఒకానొక సినిమా షూటింగ్ కోసం నాకు 12,000 రెమ్యూనరేషన్ ఇస్తానంటున్నారు నాకు 15,000 తీసుకోకపోతే గిట్టుబాటు కాదు ఏం చేయాలని సలహా అడిగితే 12,000 సింగిల్ పేమెంట్ లో తీసుకుని వాటిని మళ్లీ నిర్మాతకు తిరిగి ఇచ్చి సినిమా షూటింగ్ చివర్లో వడ్డీతో కలిపి ఇమ్మని తాను సలహా ఇచ్చినట్లుగా అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవికి అల్లుఅరవింద్కి మధ్య ఏదో జరిగిందట కదా అని అలీ ప్రశ్నిస్తే ఎలాంటి కాంట్రవర్సీ ప్రశ్నలు అడగము అని చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు ఎలా ప్రశ్నలు అడగడం ఏమిటి అంటూ అల్లు అరవింద్ ఫైర్ అయినట్లు కనిపిస్తోంది. అయితే ఇది ప్రోమో కోసమే అలా కట్ చేసారా నిజంగా అల్లు అరవింద్ ఫైర్ అయ్యారా అనే విషయం పూర్తి ఎపిసోడ్ రిలీజ్ అయితే గాని చెప్పలేము.

Also Read: Divi in God Father: మాట నిలబెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సినిమా మలుపు తిప్పే పాత్రలో దివి!

Also Read: Adipursh 3D Teaser Screening: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఆదిపురుష్ టీమ్.. మీడియాకు స్పెషల్ స్క్రీనింగ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News