Allu Arjun praises Palasa 1978 movie director Karuna Kumar: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పలాస 1978 చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించాడు. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లాక్‌డౌన్‌కి రెండు వారాల ముందు మార్చ్ 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన లభించినప్పటికి, కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి కారణంగా థియేటర్‌లు మూసివేయడంతో ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేదు.
Palasa 1978 సినిమాలో గొప్ప సందేశం ఉందని అల్లు అర్జున్ ( Allu Arjun ) ఈ సినిమా డైరెక్టర్ కరుణ కుమార్‌ను అభినందించాడు. అలాగే డైరెక్టర్ కరుణ కుమార్‌కి ఒక మొక్కని బహుమతిగా అందజేస్తున్న ఫొటోను అల్లు అర్జున్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అలాగే పలాస 1978 చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా చూసిన మరుసటి రోజు ఉదయాన్నే ఈ సినిమా డైరెక్టర్‌ని కలిశాను అని, గొప్ప సందేశంతో అద్భుతమైన ప్రయత్నం అని, అలాగే ఈ సినిమాలో చాలా మంచి సన్నివేశాలు ఉన్నాయని వ్యక్తిగతంగా తనకి బాగా నచ్చిందని బన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చారు. Also read : Puri to direct Pawan Kalyan: పూరి జగన్నాథ్‌తో పవన్ సినిమా ?
అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఒక దర్శకుడిని అక్నాలెడ్జ్ చేస్తే.. ఆ తర్వాత వారి చిత్రాలకు ఉండే మార్కెట్ కూడా మరో స్థాయిలో ఉంటుంది. ఆ లెక్కన చూసుకుంటే పలాస దర్శకుడికి అల్లు అర్జున్ నుండి మాంచి బూస్టింగ్ లభించినట్టే.
ఒక పీరియాడిక్ ఎంటర్‌టైనర్ నేపథ్యంతో తెరకెక్కిన పలాస 1978 సినిమాలో హీరో, హీరోయిన్‌లుగా రక్షిత్, నక్షత్ర ( Rakshit, Nakshatra ) నటించారు. రఘు కుంచే ( Music composer Raghu Kunche ) ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా దేశవ్యాప్తంగా దళితులపై జరిగిన దారుణాల గురించి, కుల వ్యవస్థ, రాజకీయాల గురించి ఉంటుంది. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మించారు. Also read : Allu studios inauguration: అల్లు అర్జున్ ఫ్యామిలీ నుండి.. అల్లు స్టూడియో నిర్మాణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe