Malaika Arora Pregnancy: మలైకా అరోరా తల్లి కాబోతోందన్న వార్తలపై స్పందించిన అర్జున్ కపూర్

Malaika Arora Pregnancy: తాజాగా మలైకా అరోరా ప్రెగ్నెన్సీ గురించి ఓ వార్తా కథనం రాసుకొచ్చిన పింక్ విల్లా.. ఇటీవల లండన్ వెళ్లిన మలైకా అరోరా, అర్జున్ కపూర్.. అక్కడ క్లోజ్ ఫ్రెండ్స్‌తో ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారని ఆ కథనంలో పేర్కొంది.

Written by - Pavan | Last Updated : Nov 30, 2022, 07:11 PM IST
  • మలైకా అరోరా మరోసారి తల్లి కాబోతోందంటూ వార్తలు
  • అర్జున్ కపూర్‌తో నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న మలైకా అరోరా
  • మూవింగ్ ఇన్ విత్ మలైకా కోసమేనా ? అంటున్న నెటిజెన్స్
Malaika Arora Pregnancy: మలైకా అరోరా తల్లి కాబోతోందన్న వార్తలపై స్పందించిన అర్జున్ కపూర్

Malaika Arora Pregnancy: మలైకా అరోరా మరోసారి తల్లి కాబోతోందని వచ్చిన వార్తలపై అర్జున్ కపూర్ తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు. గత నాలుగైదేళ్లుగా అర్జున్ కపూర్‌తో పీకల్లోతూ ప్రేమలో మలైకా అరోరా ప్రెగ్నెంట్ అయ్యిందంటూ మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే మలైకా అరోరా ప్రెగ్నెన్సీని ఫేక్ న్యూస్‌గా కొట్టిపారేసిన అర్జున్ కపూర్.. వ్యక్తిగత విషయాలు గురించి ప్రస్తావిస్తూ జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికాడు. 

గత నాలుగేళ్లుగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ ప్రేమించుకుంటున్నారు. 2019 లో వీళ్లిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి అర్జున్ కపూర్, మలైకా అరోరా పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక సందర్భాల్లో పుకార్లు షికార్లు చేసినప్పటికీ.. ఈ లవ్ బర్డ్స్ ఆ వార్తల్ని కొట్టిపారేస్తూ వస్తున్నారు. 

తాజాగా మలైకా అరోరా ప్రెగ్నెన్సీ గురించి ఓ వార్తా కథనం రాసుకొచ్చిన పింక్ విల్లా.. ఇటీవల లండన్ వెళ్లిన మలైకా అరోరా, అర్జున్ కపూర్.. అక్కడ క్లోజ్ ఫ్రెండ్స్‌తో ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారని ఆ కథనంలో పేర్కొంది. అయితే, మలైకా అరోరా ప్రెగ్నెంట్ అనే వార్తల్లో నిజం లేదని.. అది ఉత్తి ఫేక్ న్యూస్ మాత్రమే అని అర్జున్ కపూర్ తేల్చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ రూపంలో ఆ వార్తా కథనంపై, ఆ వార్త రాసిన జర్నలిస్టుపై అర్జున్ కపూర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యాడు. వాస్తవాలతో సంబంధం లేకుండా ఇలాంటి ఫేక్ న్యూస్ వార్తల్ని సదరు జర్నలిస్ట్ రెగ్యులర్‌గా రాస్తున్నాడని అర్జున్ కపూర్ మండిపడ్డాడు. వ్యక్తిగత విషయాల గురించి వార్తలు రాసి జీవితాలతో ఆడుకోవద్దని అర్జున్ కపూర్ హితవు పలికాడు.

మూవింగ్ ఇన్ విత్ మలైకా కోసమేనా ?  
ఇదిలావుంటే, ఇదంతా అర్జున్ కపూర్, మలైకా అరోరాలు కావాలనే తమ కొత్త రియాలిటీ షోను ప్రమోట్ చేసుకునేందుకు చేస్తోన్న స్టంట్స్ గా అభివర్ణిస్తున్నారు. మలైకా అరోరా కొత్తగా ' మూవింగ్ ఇన్ విత్ మలైకా ' అనే రియాలిటీ షోను చేస్తోంది. ఈ రియాలిటీ షో ద్వారా మలైకా అరోరా ( Malaika Arora ) తొలిసారిగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆ రియాలిటీ షోను పబ్లిక్‌లోకి తీసుకెళ్లేందుకు ఈ ఫేక్ న్యూస్ డ్రామా అయ్యుండవచ్చని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

Also Read : Vijay Devarakonda Liger : విజయ్‌ దేవరకొండను ప్రశ్నించిన ఈడీ.. వాటిపై కూపీ లాగే ప్రయత్నం?

Also Read : RRR Movie: సన్‌సెట్ సర్కిల్ బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా ఆర్ఆర్ఆర్ సినిమా, రాజమౌళికీ అవార్డు

Also Read : Mehreen Pirzada Face : మెహరీన్ మొహానికి ఏమైంది.. ఆ వైద్యాన్ని ఎందుకు ఎంచుకుంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News