C 202: భయపెడుతున్న 'సి 202' (C 202)... ఆకట్టుకుంటున్న డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ ట్రైలర్

C 202 Trailer: హారర్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు మన తెలుగు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానుంది 'సి 202’ అనే చిత్రం. ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2024, 11:03 AM IST
C 202: భయపెడుతున్న 'సి 202' (C 202)... ఆకట్టుకుంటున్న డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ ట్రైలర్

C 202 Horror Thriller
హారర్ త్రిల్లర్ ఇష్టపడే ప్రేక్షకులకు.. సరికొత్త కాన్సెప్ట్ చూపించడానికి వచ్చేస్తోంది 'సి 202’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోక ఇప్పుడు ట్రైలర్ విడుదల అయ్యి ఈ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచింది.

మైటీ ఒక్ పిక్చర్స్ (Mighty Oak Pictures) పతాకం పై తనికెళ్ళ భరణి, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ,  శుభలేఖ సుధాకర్, ప్రధాన పాత్రలో  మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశి హీరో గా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202' (C 202). ఈ సినిమా మొత్తం రాత్రిపూట చిత్రీకరించబడింది. ఈ మధ్యనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా ట్రైలర్ అందరిలో మరింత ఆసక్తి నెలకొల్పింది. ఒక డైలాగ్ కూడా లేకుండా ముఖ్య తారాగణాన్ని చూపిస్తూ అదిరిపోయే సౌండ్ ఎఫెక్ట్స్ తో రెండు నిమిషాల ఎనిమిది సెకెన్ల ట్రైలర్ ను విడుదల చేశారు సినిమా యూనిట్. 

ఈ ట్రైలర్ ను సొంత బ్యానర్ మైటీ ఒక్ పిక్చర్స్ యూట్యూబ్ ఛానల్ లో ప్రేక్షకులకి అందుబాటులో ఉంచారు. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమాని కామెంట్ సెక్షన్లో తెగ పొగుడుతున్నారు.

 

ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ "ఈరోజు 'సి 202' (C 202) సినిమా ట్రైలర్ ను విడుదల చేసాం. ఒక డైలాగ్ కూడా లేకుండా క్యారెక్టర్ లను చూపిస్తూ మంచి సౌండ్ ఎఫెక్ట్స్ తో మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులకు మా చిత్రం పైన అంచనాలు పెంచేలా రూపొందించాము. మా ట్రైలర్ కి 'సౌండ్ ఆఫ్ సి 202 (Sound of C 202) అని పిలుచుకుంటున్నాము. మా ట్రైలర్ ని మంచి సౌండ్ సిస్టమ్ తో చూడండి, ఖచ్చితంగా మా 'సి 202' (C 202) చిత్రం మీద మీ అంచనాలు రెట్టింపు అవుతాయి” అని తెలియజేశారు.

“మా 'సి 202' (C 202) చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. కథ స్క్రీన్ ప్లే మొత్తం కూడా చాలా అద్భుతమైన సస్పెన్స్ తో భయపడే హారర్ సన్నివేశాలతో మంచి త్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో సినిమా ని చిత్రకరించాము. షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ప్రస్తుతానికి రామానాయుడు స్టూడియోస్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాంకేతికంగా మేము హై-ఎండ్ కెమెరాలను మరియు మంచి లైటింగ్ పరికరాలు ఉపయోగించాము. మా చిత్రం లో శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ తనికెళ్ళ భరణి, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలు పోషించారు. వీళ్ళు ఎప్పుడు చేయని పాత్రలో నటించి ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తారు. ఈ సినిమాలో మొత్తం పైన 21 నిమిషాల గ్రాఫిక్ ఉంటాయి. మా సినిమా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం" అని చెప్పుకొచ్చారు.

మున్నా కాశి, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, షారోన్ రియా ఫెర్నాండెజ్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించిన ఈ సినిమాకి సీతారామరాజు ఉప్పుతాల్లా కెమెరా మాన్ గా పనిచేయగా..కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం ..మున్నా కాశి అందించారు.

Also Read: Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్‌, ధర పరంగా ఇదే బెస్ట్‌!

Also Read: Movies Postponed: 'వ్యూహం, శపథం' మళ్లీ వాయిదా.. నారా లోకేశ్‌కు ఆర్జీవీ అదిరిపోయే పంచ్‌

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News