Devi Sri Prasad Marriage: ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోన్న దేవీ శ్రీ ప్రసాద్.. 17 ఏళ్ల ఏజ్ గ్యా్ప్ ఉందంటూ వార్తలు

Devi Sri Prasad Marriage Rumors: దేవీ శ్రీ ప్రసాద్ పెళ్లిపై ఇప్పటికే ఎన్నో రూమర్లు వచ్చాయి. ఇంత వరకు అవేవీ నిజం కాలేదు. కానీ ఈ సారి మాత్రం పెళ్లి వార్తలు చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి ఈ సారైనా ఈ పెళ్లి వార్తలు నిజం అవుతాయో లేదో చూడాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2023, 10:50 AM IST
  • నెట్టింట్లో దేవీ శ్రీ ప్రసాద్ సందడి
  • పెళ్లి రూమర్లతో ఒక్కసారిగా ట్రెండ్
  • పెళ్లి వార్తలపై స్పందించని డీఎస్పీ
Devi Sri Prasad Marriage: ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోన్న దేవీ శ్రీ ప్రసాద్.. 17 ఏళ్ల ఏజ్ గ్యా్ప్ ఉందంటూ వార్తలు

Devi Sri Prasad Marriage Rumors: టాలీవుడ్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో ముందు వరుసలో ఉంటాడు. దేవీ శ్రీ ప్రసాద్ నాలుగు పదుల వయసులోకి వచ్చాడు. ఇప్పటికే డీఎస్పీ పెళ్లి మీద ఎన్నో రూమర్లు వచ్చాయి. ఎంతో మంది హీరోయిన్లతోనూ దేవీ శ్రీ ప్రసాద్ రిలేషన్ మెయింటైన్ చేశారనే గాసిప్స్ కూడా వచ్చాయి. కానీ అవేవీ బయటకు రాలేదు. పెళ్లి వరకు వెళ్లలేదు. తాజాగా దేవీ శ్రీ ప్రసాద్‌ పెళ్లికి సంబంధించిన రూమర్లు వస్తున్నాయి.

ప్రస్తుతం 43 ఏళ్ల వయసున్న దేవి తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతోన్నాడట. వరుసకు మరదలయ్యే అమ్మాయితో పెద్దలు ఈ పెళ్లి చేస్తున్నారట. ఈ జోడి మధ్య 17 ఏళ్ల ఏజ్ గ్యా్ప్ ఉంటుందన్న వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పుడు కాస్త డౌన్ ఫాల్‌లోనే ఉన్నాడు. పుష్ప పాటలు హిట్ అయినా కూడా దాన్ని తన ఖాతాలో వేసుకునే ప్రమోషన్స్ చేయలేదు. ఎక్కడా హడావిడి చేయలేదు.

పుష్ప మొదటి పార్ట్ అంతలా హిట్ అవ్వడానికి పాటలే కారణం. దీంతో రెండో పార్ట్ మీద మరింత అంచనాలు పెరిగాయి. దీంతో దేవీ మీద పెద్ద బాధ్యత పెట్టినట్టు అయింది. రెండో పార్ట్‌కు అంతకు మించిన మ్యూజిక్ ఇవ్వాలని దేవీ ప్రయత్నిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పుడు పుష్ప ది రూల్‌కు మ్యూజిక్ ఇచ్చే పనిలోనే ఉన్నాడు.

అసలే ఇప్పుడు అంతా కూడా తమన్ హవానే నడుస్తోంది. పెద్ద హీరోలంతా కూడా తమన్‌నే కోరుకుంటున్నారు. చివరగా వాల్తేరు వీరయ్య సినిమాతో దేవీ శ్రీ ప్రసాద్ అదరగొట్టేశాడు. ముందుగా ఆ పాటల మీద ట్రోలింగ్ జరిగినా.. చివరకు అవే హిట్ అయ్యాయి. వీర సింహా రెడ్డితో తమన్ బోల్తా పడితే.. వీరయ్య సినిమాతో దేవీ శ్రీ ప్రసాద్ నిలబడ్డాడు.

ఇక దేవీ శ్రీ ప్రసాద్ ఎక్కువగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాడు. భక్తి పాటలు, ఐటం పాటలు ఒకటే అంటాడు. మొన్నామధ్య చేసిన ప్రైవేట్ ఆల్బమ్ కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఇలా వివాదాలు దేవీ శ్రీ ప్రసాద్‌కు కొత్తేం కాదు. అయితే ఇప్పుడు ఈ పెళ్లి రూమర్లపై దేవీ శ్రీ ప్రసాద్ స్పందిస్తాడా? లేదా? అన్నది చూడాలి.

Also Read:  Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్

Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News