Dimple Hayathi Lawyer About Case: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి ఆమె అపార్ట్మెంట్ లో నివసిస్తున్న ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే మధ్య వివాదం ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదు. నిజానికి డింపుల్ తన కారు మీద దాడి చేసింది అని ఆరోపిస్తూ డిసిపి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయం మీద డింపుల్ హయాతి కూడా తన లాయర్ ద్వారా సమాధానాలు చెప్పించింది. ఇప్పుడు తాజాగా మరోసారి డింపుల్ హయాతి లాయర్లు తెరమీదకు వచ్చారు. డింపుల్ హయతికి ప్రాణహాని ఉందని చాలామంది నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె లాయర్ మీడియాకు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం డిసిపి రాహుల్ హెగ్డే జంతువులను హింసిస్తుంటే చూసి డింపుల్ హయాతి వారించిందని, ఆ కక్షతోనే డింపుల్ మీద ఫాల్స్ కేసు పెట్టారని డింపుల్ తరఫున లాయర్ వెల్లడించారు.
Also Read: 2018 Telugu Review: మలయాళంలో కోట్లు కొల్లగొట్టిన '2018' రివ్యూ -రేటింగ్.. ఎలా ఉందంటే?
ఇక డింపుల్ హయాతి ఎక్కడా కూడా రాహుల్ హెగ్డే కారును తన్నినట్లు సిసి ఫుటేజ్ లేదని కావాలని ఏదో జరిగిపోతుందనే భ్రమ కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. డింపుల్ హయాతి చాలా మెంటల్ స్ట్రెస్ కి గురైందని ఇప్పుడు బయటకు వెళ్లేందుకు కూడా ఆమె భయపడుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటామని ఆయన అంటున్నారు. ఇక తెలుగు అమ్మాయి అయిన డింపుల్ హయాతి తెలుగులో కొన్ని సినిమాలు చేసింది.
అదే విధంగా తమిళ్ లో కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. తెలుగులో గద్దలకొండ గణేష్ సినిమా ద్వారా ఆమె ఐటెం సాంగ్ చేసి ఒక్కసారిగా తెలుగు వారందరికీ పరిచయమైంది. ఈ మధ్యనే ఆమె రామబాణం అనే సినిమాలో కూడా గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించింది. అయితే తెలుగులో సరైన సక్సెస్ లభించక పోయినా ఆమె ఇలా వివాదాల పాలవడం మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. ఈ విషయంలో డింపుల్ హయాతి డిసిపి మధ్య జరుగుతున్న వివాదం ఇంకా ఎంత దూరం వెళ్లబోతోంది అనేది కాలమే నిర్ణయించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK