Drishyam 3 Announced: హీరోతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో రీమేక్ అయి సూపర్ హిట్ కొట్టిన సినిమా ఏదైనా ఉందంటే అది దృశ్యం. అందుకే దృశ్యం సినిమా ఫ్రాంచైజ్ అని పిలవాల్సి వస్తోంది. ఇప్పుడు దృశ్యం సినిమా అభిమానులకు గ్రేట్ న్యూస్ ఇది. దృశ్యం సినిమాకు ఇప్పుడు మూడో భాగం వస్తోంది. నటుడు మోహన్ లాల్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
దృశ్యం సినిమా ఫ్రాంచైజీలో మేజర్ అప్డేట్ ప్రకటించారు నిర్మాతలు. త్వరలో దృశ్యం-3 ఉంటుందని అధికారికంగా వెల్లడించారు. ఎప్పుడు విడుదలవుతుంది, ఎవరెవరు నటిస్తున్నారనేది ఇంకా తెలియలేదు. మోహన్ లాల్ స్వయంగా సోషల్ మీడియాలో దృశ్యం-3 గురించి ప్రకటించారు. గతం ఎప్పుడూ మౌనంగా ఉండదు..దృశ్యం-3 ఖాయం అంటూ పోస్ట్ చేశారు. దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత ఆంటోని పెరంబవూర్తో ఉన్న ఫోటోను మోహన్ లాల్ ఈ సందర్భంగా షేర్ చేశారు.
భారతీయ చలనచిత్ర రంగంలో దృశ్యం సినిమాకు చాలా ప్రత్యేకత ఉంది. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమా అద్భుతమైన త్రిల్లర్ సిరీస్ మొదటి రెండు సీక్వెల్స్ హిట్ అయ్యాయి. అద్భుతమైన స్టోరీ లైన్, ఊహించని ట్విస్ట్‌లతో సినిమా నడుస్తుంది. దృశ్యం-1 2013లో విడుదలైంది. ఇది మలయాళంలో గేమ్ ఛేంజర్ అయింది. ఆ తరువాత ఇతర భాషల్లో ఉండా చాలా హిట్ అయింది. ఓ మధ్య తరగతి కుటుంబీకుడు తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నాడనేది కథాంశం. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ రీమేక్‌లో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇక దృశ్యం-2 2021లో విడుదలైంది. దృశ్యం-1లో క్లోజ్ అయిన కేసును ఇందులో తిరిగి ఓపెన్ చేస్తారు. రెండో భాగంలో కూడా తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు చాలా వ్యూహాలు పన్నుతాడు హీరో. మరి మూడో భాగం దృశ్యం-3లో పోలీసులకు చిక్కుతాడా లేదా అనేది తెలియదు.
Also read: AP Telangana Weather Report: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్షసూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి