F3 Ticket Price: సినీ అభిమానులకు శుభవార్త.. ఎఫ్ 3 టికెట్స్ రేట్స్ యథాతథం!

No price hike for F3 tickets. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్‌ 3 సినిమా టికెట్స్ రేట్స్ యథాతథంగా ఉంటాయని నిర్మాత దిల్‌ రాజు ప్రకటించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 04:15 PM IST
  • మే 27న 'ఎఫ్‌ 3' విడుద‌ల
  • సినీ అభిమానులకు శుభవార్త
  • ఎఫ్ 3 టికెట్స్ రేట్స్ యథాతథం
F3 Ticket Price: సినీ అభిమానులకు శుభవార్త.. ఎఫ్ 3 టికెట్స్ రేట్స్ యథాతథం!

F3 Movie Ticket Prices not hike in Telangana and AP States: ఫామిలీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన తాజా సినిమా 'ఎఫ్‌ 3'. శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌ రాజు, శిరీష్‌లు ఈ సినిమాను నిర్మించారు. తమన్నా భాటియా, మెహ్రీన్ ఫిర్జాదా కథానాయికలు. 2019లో సంక్రాంతి కానుక‌గా విడుద‌లై భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఎఫ్‌ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్‌ 3 తెర‌కెక్కింది. ఎఫ్ 2కి మించిన వినోదం ఎఫ్ 2లో ఉంటుందని డైరెక్టర్ ముందునుంచి చెపుతున్నాడు. మే 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎఫ్‌ 3 సినిమా నుంచి కీలక అప్ డేట్ బయటికొచ్చింది. 

ఎఫ్‌ 3 సినిమా టికెట్స్ రేట్స్ యథాతథంగా ఉంటాయని నిర్మాత దిల్‌ రాజు ప్రకటించారు. టికెట్స్ రేట్స్ పెంచడం లేదని చెప్పేందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత దిల్‌ రాజు కలిసి ఓ ఫన్నీ వీడియో చేశారు. అందులో ఓ మహిళ తమ్ముల్లు అనుకుంటూ వచ్చి సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు అడుగుతుంది. అది కుదరని నిర్మాత రాజు చెపుతాడు. సినిమా రేట్స్ ఎంత పెంచారు అని సదరు మహిళ అడగ్గా.. ఎఫ్ 3 టిక్కెట్ రేట్లు పెంచడం లేదని, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతోనే కుటుంబంతో కలిసి హ్యాపీగా సినిమా చూడండని దిల్‌ రాజు చెపుతారు. విషయం తెలిసిన ఫాన్స్ ఆనందపడిపోతున్నారు. 

ఇటీవలి కాలంలో తెలంగాణ, ఆంధ్రాలోనూ పెద్ద సినిమాలు విడుదలైతే ప్రభుత్వ పెద్దలను కలిసి సినిమా టిక్కెట్ రేట్లును వారం లేదా పది రోజుల పాటు నిర్మాతలు పెంచుకుంటున్నారు. బీమ్లా నాయక్ సినిమాకు తెలంగాణాలో పెంచగా.. రాధేశ్యామ్, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్, ఆచార్య, సర్కారువారి పాట సినిమాలకు రెండు రాష్ట్రాల్లో పెంచారు. ఇలా టికెట్స్ రేట్స్ పెంచడం ఎంతమాత్రం సబబు కాదని కొందరు విమర్శించారు. టిక్కెట్ రేట్లు పెంచి అమ్మడం వల్ల ఓపెనింగ్స్ బాగా పడిపోయాయని కూడా మరికొందరు అన్నారు. భారీ టికెట్ రేట్ కారణంగా సినీ ప్రియులు కూడా థియేటర్ వైపు వెళ్లడం లేదు. 

అయితే 'ఎఫ్‌ 3' సినిమా నిర్మాత దిల్‌ రాజు తమ సినిమాకు టికెట్స్ రేట్స్ పెంచడం లేదని చెప్పి సినీ అభిమానులకు తీపి కబురు అందించారు. ఈ నిర్ణయంతో ఎఫ్ 3 మూవీకి మంచి ఓపెనింగ్స్ వస్తాయేమో చూడాలి. ఈ సివిమలో వెంకటేష్, వ‌రుణ్‌ల‌కు జోడీగా త‌మ‌న్నా, మెహ‌రిన్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. సునీల్, సోనాల్‌ చౌహ‌న్‌లు కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేశారు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ప్రేక్షకులకు అందాల విందు చేయనున్నారు. గతవారం విడుదలైన ఎఫ్ 3 ట్రైలర్ భారీ అంచులను పెంచింది. 

Also Read: Tim David Six: టీమ్ డేవిడ్ విధ్వంసం.. ఐపీఎల్‌ చరిత్రలోనే భారీ సిక్సర్‌ (వీడియో)

Also Read: Kane Williamson: స్వదేశానికి వెళ్లిపోయిన కేన్ మామ.. సన్‌రైజర్స్‌ కొత్త కెప్టెన్ ఎవరంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News