Ravi Teja: థియేటర్ ల విషయం లో ఈగల్ కి సవాల్.. ఢీలా పడుతున్న రవితేజ అభిమానులు

Eagle: వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న రవితేజ ఈసారైనా హిట్ అందుకోగలరో లేదో అనేది పెద్ద సందేహంగా మారింది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాకి థియేటర్లు కూడా తక్కువ అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈగల్ సినిమా హిట్ అవుతుందా లేదా అని అభిమానులకి కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2024, 12:10 PM IST
Ravi Teja: థియేటర్ ల విషయం లో ఈగల్ కి సవాల్.. ఢీలా పడుతున్న రవితేజ అభిమానులు

Sankranthi Releases 2024: ప్రతి ఏడాది లాగా ఈ ఏడాది కూడా బోలెడు తెలుగు సినిమాలు సంక్రాంతి విడుదల కి సిద్ధం అవుతున్నాయి. పెద్ద హీరోల నుంచి స్టార్ నిర్మాతల వరకు అందరూ తమ సినిమాలని సంక్రాంతి బరిలో దింపడానికి రెడీగా ఉన్నారు. సంక్రాంతి అంటేనే సినిమాల సీజన్. అందుకే ఈ సంవత్సరం కూడా చాలానే సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అన్ని సినిమాల మధ్య తట్టుకొని కలెక్షన్లు రాబట్టాలంటే సినిమా మీద క్రేజ్ విపరీతంగా ఉండాలి.

ఈ నేపథ్యంలో సినిమాకి ప్రమోషన్లు చాలా ముఖ్యం. ఇక సినిమా ప్రమోషన్ లతో పాటు థియేటర్ లను బ్లాక్ చేయటం కూడా చిత్ర నిర్మాతలకు అంతే ముఖ్యం. అందులోనూ బీ, సీ సెంటర్ లలో థియేటర్లు దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. ఎక్కువ థియేటర్లు చేతిలో ఉంటే తప్ప సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు చెప్పుకోదగ్గ స్థాయిలో రావు. 

ఈ సంవత్సరం సంక్రాంతి బరి లోకి దిగుతూ ప్రస్తుతం ప్రమోషన్లతో బిజీగా ఉన్న సినిమా ఈగల్. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా సినిమా పాటలతో పాటు ఇంటర్వ్యూలు ఈవెంట్ లతో చిత్ర బృందం సినిమాపై భారీగా బజ్ ను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

ప్రమోషన్లు ఎంత భారీ స్థాయిలో ఉన్నప్పటికీ.. థియేటర్లు ఎక్కువ దొరకకపోతే సినిమా మొదటి రోజు కలెక్షన్లు డీలా పడిపోవటం ఖాయం. అయితే రవితేజ సినిమా కాబట్టి సీ సెంటర్లలో స్క్రీన్లు బాగానే దొరకొచ్చని అందరూ భావించారు.. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా లేదని తెలుస్తోంది. చాలా వరకు థియేటర్లు మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్ సినిమాలకి వెళ్ళిపోయాయి అని టాక్ వినిపిస్తోంది.

అటు కర్నూల్ లో కూడా అదే పరిస్థితి ఉందని సమాచారం. ఈగల్ తో పాటు నాగార్జున నా సామి రంగా, తేజ హనుమాన్ సినిమాలకు కూడా ఎక్కువ థియేటర్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఈసారి సంక్రాంతి సినిమాల మధ్య భారీగానే పోటీ ఉంది. మరి ఇంత పోటీ మధ్యలో రవితేజ సినిమా ఎంతవరకు ఆడుతుందో అని డిస్ట్రిబ్యూటర్లు కూడా భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది.

వరుసగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి డిజాస్టర్ సినిమాల తర్వాత రవితేజ మళ్ళీ హిట్ అందుకోగలరా లేదా అని అందరిలో అనుమానం కూడా ఉంది. పైగా సంక్రాంతి బరిలో దిగుతున్న పెద్ద సినిమాల మధ్య ఈ సినిమా మళ్లీ ఫ్లాప్ అవుతుందేమోనని భయం కూడా ఉంది. 

సినిమాను నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు మాత్రం సంక్రాంతి బరి నుండి వెనక్కి తగ్గేది లేదు అన్నట్టు సినిమా విడుదలని వాయిదా కూడా వేయటం లేదు. మరి ఈగల్ పరిస్థితి ఏమవుతుందో అని అభిమానులు కంగారు పడుతున్నారు.

Also read: Ysrcp Strategy: కాపు ఓట్లపై దృష్టి సారించిన వైసీపీ, వంగవీటి, ముద్రగడ కోసం ప్రయత్నాలు

Also Read: Redmi Note 13 Pro 5G: Redmi Note 13 సిరీస్‌ మొబైల్స్‌ల ధరేంతో తెలుసా? లీక్‌ అయిన ధర, ఫీచర్స్‌ వివరాలు! 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News