Karthika Deepam 2: కన్నతండ్రిని కడతేర్చిన జ్యోత్స్న.. దశరథ కళ్ల ముందే దారుణం, గ్రానీకి పుత్రశోకం 

Karthika Deepam 2 Today January 16th Episode: జ్యోత్స్న దాసుపై దాడి చేస్తుంది. ఈ సీన్‌ దశరథ చూస్తాడు. నేను చచ్చినా కూడా నిజం చెప్పే చస్తా అన్నావు కదా.. చచ్చిపో. అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా.. నువ్వు అమ్మ దగ్గరికే వెళ్లు అంటుంది. అప్పుడే దశరథ కిందికి పరుగెత్తుకుని వస్తాడు. గ్రానీ కొడుకు బతకకూడదు అని కారులో ఎక్కించుకుని స్పీడ్‌గా వెళ్లిపోతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jan 16, 2025, 10:46 AM IST
Karthika Deepam 2: కన్నతండ్రిని కడతేర్చిన జ్యోత్స్న.. దశరథ కళ్ల ముందే దారుణం, గ్రానీకి పుత్రశోకం 

Karthika Deepam 2 Today January 16th Episode:  ఇదంతా గమనించిన దశరథ కారులో జోను ఫాలో అవుతాడు. కంగారు పడుతూ కారు డ్రైవ్‌ చేస్తూ వెళ్తుంది జో. తన కారునే ఫాలో అవుతాడు దశరథ కూడా. కారు ఎవ్వరూ లేని ప్రదేశంలో ఆపుతుంది. దూరంగా దశరథ కారు ఆపి అదంతా గమనిస్తాడు. కారులో నుంచి దాసును బయటకు లాగుతుంది. ఒక పక్కనే పడేస్తుంది. నన్నేందుకు హంతకురాలిని చేశావు అంటుంది. ఉన్నావా? పోయావా? అంటుంది. ఊపిరి అయితే, ఆగిపోయింది కానీ, ఇలా వదిలేయకూడదు పూర్తిగా చంపేద్దాం అని పక్కనే ఉన్న గ్రానేట్‌ తీసుకుంటుంది. నేను బతకాలి అంటే నా గురించి నిజం తెలిసిన వారు ఎవకరూ బతక్కూడదు అంటుంది. వెంటనే కారు హారన్‌ చప్పుడు చేస్తాడు దశరథ. వెంటనే రాయి పక్కన పడేస్తుంది. ముందు నేనిక్కడి నుంచి పారిపోవాలి ఎవరో వస్తున్నట్లున్నారు అని కారు ఎక్కి పారిపోతుంది.వెంటనే దశరథ దాసును లేపే ప్రయత్నం చేస్తాడు. 

మరోవైపు కార్తీక్‌ శౌర్యను సైకిల్‌పై ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తుంటాడు. డాక్టర్‌ సర్జరీ విషయంపై గుర్తుచేసుకుంటాడు. నాన్న నాకు ఏమైంది అంటాడు ఏంకాలేదు ట్యాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది అన్నాడు డాక్టర్‌. లేదు నాన్న నేను అంతా విన్నాను నన్ను వన్‌ వీక్‌ ఆసుపత్రిలో ఉండమని చెప్పాడు కదా.. ఇంజెక్షన్‌ చేశారు కదా.. కళ్లు తిరిగినట్లు అనిపించి పడుకున్నాను అంటుంది. ఏం లేదు నీకు బలం తక్కువ ఉంది కదా.. అందుకే ఆసుపత్రిలో వన్‌ వీక్‌ జాయిన్‌ చేయమన్నారు కానీ ఈ విషయం అమ్మకు చెప్పకూడదు అంటాడు. నీకు ఇష్టమైంది ఇస్తాను అంటాడు. అడిగితే కాదు అనవు కదా.. అంటుంది. నాకు ఇవ్వనని దాచుకున్నావ్ కదా ఆ లాకెట్‌ ఇవ్వు అంటుంది. ఇస్తా అంటాడు కార్తీక్‌ ఆ మనిషి నా ప్రాణాలు కాపాడింది ఆ లాకెట్‌ నీ ప్రాణాలు కూడా కాపాడుతుంది ఏమో..అనుకుంటాడు.

సుమిత్రను డోర్‌ కొడుతూ ఉంటుంది అప్పుడే పారు వస్తుంది. డోర్‌ తీస్తుంది. నా డోర్‌ ఎవరు లాక్‌ చేశారు జ్యోత్స్న ఏది? జ్యోత్స్న అని పిలుస్తుంది. అప్పుడే కారులో వస్తుంది జో వాడు చచ్చిపోవాలి అనుకుంటూ లోపలికి వస్తుంది. సుమిత్రను చూస్తుంది. ఎక్కడికి వెళ్లావే అంటుంది. మర్డర్‌ చేయడానికి వెళ్లా అంటుంది జో. నిన్నేనే అడిగేది ఎక్కడికి వెళ్లావు అంటుంది పారు. ఏయ్‌,  జ్యోత్స్న అంత వెటకారమా అంటుంది జో బెడ్‌రూమ్‌లోకి వెళ్లిపోతుంది. ఇక్కడ గది తలుపు తాళం వేయడానికి, జో బయట నుంచి కంగారు పడటానికి కారణం ఏమైనా ఉందా అంటుంది. నిజంగానే మర్డర్‌ చేయడానికి వెళ్లిందా అనుకుంటుంది.

మరోవైపు ఆసుపత్రిలో దాసుకు దశరథ చికిత్స చేయిస్తాడు. నా కూతురు ఒక మనిషిని చంపేంతా దుర్మార్గురాలు అంటే తట్టుకోవడం నావల్ల కావట్లేదు అనుకుంటాడు. అప్పుడే డాక్టర్‌ వస్తాడు దశరథ ఫ్రెండ్‌  ఎవరో కావాలని బలంగా కొట్టారు ఎవరు కొట్టారు అంటాడు. బతకడం కష్టం, ఒకవేళ బతికినా కోమాలో ఉంటాడు కానీ స్పృహలోకి రాడు అంటాడు. దశరథ ఏడుస్తాడు లక్షలు కాదు కోట్లు ఖర్చు అయినా ఫర్వాలేదు వాడు బతకాలి. వాడు నా తమ్ముడు ఇక్కడ ఉన్నట్లు మనకు తప్ప ఎవ్వరూ ఇక్కడకు రాకూడదు అంటాడు. సరేరా అంటాడు డాక్టర్‌ ఫ్రెండ్‌ కానీ, ప్రాబ్లెమ్‌ రాకుండా చూసుకో అంటాడు.

దశరథ దాసును చూడటానికి లోపలికి వస్తాడు, నిన్ను నా కూతురు ఎందుకు చంపాలనుకుందో, నువ్వు నన్ను ఎందుకు కలవాలని వచ్చావో నీకు ఏం కానివ్వను నేను కాపాడుకుంటాను ఎవర్నీ అడగను అంటాడు. కార్తీక్‌ దీపతో బయటకు వెళ్లి వస్తానని చెబుతాడు. శౌర్యకు ఏమైంది అంటుంది. ఏం కాలేదు అంటాడు, మరి ట్యాబ్లెట్స్‌ ఎందుకు అంటుంది. విటమిన్స్‌ మినరల్స్‌ సరిగ్గా అందట్లేదు అంటాడు. నేనే తినిపిస్తున్నా కదా అంటుంది దీప. ఏం రౌడీ నువ్వు సరిగ్గా తినట్లేదు కదా అంటాడు.అవును నాన్న ఏది చెబితే అదే నిజం సరిగ్గా తినడం లేదు అంటుంది. ఏ రౌడీ నువ్వు నానమ్మ దగ్గరికి వెళ్లి ఆడుకో అంటాడు. 

ఇదీ చదవండి :  బాలీవుడ్‌లో సంచలనం.. స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితోదాడి, ఆసుపత్రికి తరలింపు..

మీరు ఏదో దాస్తున్నారు బాబు దాని జోలికి భర్త వస్తే చంపడానికి వెనుకాడలేదు, దానికి ఏమైనా అయితే,నేను చావడానికి కూడా వెనుకాడను ఇప్పుడు చెప్పండి బాబు శౌర్యకు ఏమైంది అంటుంది దీప. నువ్వు అంత స్పష్టం చెబితే ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటాడు కార్తీక్. ఏం లేదు అంటాడు. సుమిత్ర కంగారు పడుతుంది ఆయన ఫోన్‌ లిఫ్ట్ చేయడం లేదు అంటుంది. శివన్నారాయణ వింటుంటాడు అప్పుడే దశరథ ఇంటికి వస్తాడు ఏమైంది అంటుంది సుమిత్ర. డాడీ ఏంటి ఇంట్లోనే ఉన్నాడు కదా.. కొంపదీసి నా వెంట ఫాలో అయ్యాడా ఏంటి? అనుకుంటుంది.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News