KGF makers filed a case on Rahul Gandhi: అదేమిటి రాహుల్ గాంధీకి కేజిఎఫ్ మేకర్స్ షాక్ ఇవ్వడం ఏమిటి? అనుకుంటున్నారా అయితే అసలు విషయం చదవాల్సిందే. ప్రస్తుతానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కవర్ అయ్యే విధంగా ఒక పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రకు మీడియా నుంచి సరైన కవరేజ్ లభించడం లేదు. కానీ ప్రజల నుంచి మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది.
తనతో పాదయాత్రలో కలిసి నడుస్తున్న వారందరితో మమేకమవుతూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. మీడియా కవర్ చేయడం లేదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఈ పాదయాత్రను గట్టిగా హైలైట్ చేస్తోంది. కొన్ని సినిమా పాటలతో కూడా రాహుల్ గాంధీ ఫోటోలు వీడియోలు మిక్స్ చేసి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా సూపర్ హిట్ కేజిఎఫ్ పాటలను రాహుల్ గాంధీ ఫోటోలు వీడియోలతో మిక్స్ చేసి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది.
2018లో విడుదలైన కేజిఎఫ్ మొదటి పార్ట్ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది రెండో భాగాన్ని కూడా విడుదల చేసి సూపర్ హిట్ అందుకున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో రవి బస్రూర్ అందించిన సౌండ్ ట్రాక్ అలాగే పాటలు కూడా అంతే హిట్ అయ్యాయి. ఒకరకంగా ఆ పాటలు వింటేనే ఉత్తేజం వచ్చే విధంగా పాటల రూపొందించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి కూడా కేజిఎఫ్ స్థాయిలో ఎలివేషన్స్ ఇస్తూ పాటలు సిద్ధం చేయడంతో కేజిఎఫ్ మేకర్స్ కాపీరైట్ క్లైమ్ చేస్తూ కేసు వేసినట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ పైన ఆయన పార్టీ పైన ప్రస్తుతానికి ఈ కాపీరైట్ కేసు వేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమా మ్యూజిక్ హక్కులను ఎమ్మార్టీ అనే మ్యూజిక్ సంస్థ కొనుగోలు చేసింది. ఎలాంటి పర్మిషన్ లేకుండా తమ దగ్గర హక్కులు ఉన్న కేజిఎఫ్ 2లోని రణధీర అనే సాంగ్ ని రాహుల్ గాంధీ విజువల్స్ తో అటాచ్ చేసి వాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. మరి ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందించబోతోంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Miheeka Daggubati: చంటి బిడ్డతో ఫోటో షేర్ చేసిన రానా భార్య.. శుభాకాంక్షలు వెల్లువ.. అసలు విషయం ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook