Devi Sri Prasad o Pari Song Controversy : సినిమాలు, అందులోని పాటలు, మాటలు కాంట్రవర్సీలో చిక్కుకోవడం పరిపాటే. ఇక ప్రైవేట్ ఆల్బమ్స్ సైతం అప్పుడప్పుడు ఈ కాంట్రవర్సీలో చిక్కుకుంటాయి. విచిత్రం ఏంటంటే.. ఇలాంటి కాంట్రవర్సీలు జరిగిన తరువాతే.. ఆ పాట మరింత ఎక్కువ మందికి తెలుస్తుంది. మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ కాంట్రవర్సీలు క్రియేట్ చేయడంతోనే మరింతగా పాట వైరల్ అవుతుంది. అప్పటి వరకు తెలియని వాళ్లకి సైతం ఆ పాటలు తెలుస్తుంటాయి.
అలాంటి ఓ ఘటనే ఇప్పుడు జరిగింది. దేవీ శ్రీ ప్రసాద్ గత నెలలో హిందీలో ఓ పరి అనే పాటను విడుదల చేశాడు. ఇక తెలుగులో ఈ పాటను ఓ పిల్లా అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద రిలీజ్ చేశాడు. అయితే ఈ ఆల్బమ్ వచ్చిన చాలానే రోజులు అవుతోంది. ఇది అంత పెద్దగా ఏమీ క్లిక్ కాలేదు. అయితే ఇప్పుడు చెలరేగిన కాంట్రవర్సీతో ఓ పరి పాట ట్రెండింగ్‌లోకి వచ్చేస్తోంది.
ఓ పిల్ల పాటలో హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని పిచ్చి పిచ్చిగా వాడారంటూ, అశ్లీలంగా నృత్యాలు వేశారంటూ తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ హిందూ సంఘాలు, కరాటే కళ్యాణి వంటి వారు దేవీ శ్రీ ప్రసాద్ మీద ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు స్పందించారు. దేవి శ్రీ ప్రసాద్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఈ నెల 2వ తేదీన లలిత్ కుమార్, కరాటే కళ్యాణి, హిందూ మత సంఘాలు కలిసి దేవీ శ్రీ ప్రసాద్ మీద ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఆ కంప్లైంట్ లో ఉన్న సారాంశం పైన కేసు నమోదు చేశామని, హరే రామ హరే కృష్ణ తారక మంత్రాన్ని ఐటెం సాంగ్ ఆల్బమ్ లో జతపరిచారని కంప్లైంట్ చేశారంటూ పోలీసులు తెలిపారు. హిందూ మనోబావాలను దెబ్బ తీసే విధంగా ఉందని కంప్లైంట్ లో పేర్కొన్నారని అన్నారు.దేవి శ్రీ ప్రసాద్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశామని, లీగల్ ఒపీనియన్ తీసుకున్నంక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
Also Read : The Ghost OTT : ఓటీటీలో టాప్ ప్లేస్‌లో The Ghost.. నాగార్జున ట్వీట్‌పై నెటిజన్ల రియాక్షన్
Also Read : Acharya TRP Ratings : బాలయ్య, నాగ్, వెంకీల కన్నా దారుణం.. చిరు సినిమా స్థానమిదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook