Guntur Kaaram OTT Date Out: ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదలైన మహేష్ బాబు సినిమా గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మొదటి నుంచి భారీగా ఉన్నాయి. కానీ ఈ సినిమా మొదటి షో నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది.
జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమధ్య స్టార్ హీరోల సినిమాలు సైతం నెల తిరక్కముందే ఓటీటీలోకి రావడం మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు అదే ఫాలో అయిపోయింది మహేష్ బాబు గుంటూరు కారం. ఈ మధ్య విడుదలైన ప్రభాస్ సలార్ సినిమా విడుదలైన నెల కన్నా ముందే డిజిటల్ స్ట్రీమింగ్ మొదలుపెట్టేగా.. ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం కూడా నెల తిరక్కముందే నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షం కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు నెట్ ఫ్లిక్స్
సంస్థ.
ఈ మహేష్ బాబు సినిమా ఫిబ్రవరి 9 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. రౌడీ రమణ వచ్చేస్తున్నాడ్రోయ్.. అని సంబరపడుతున్నారు.
Rowdy Ramana ni cinemascope 70 mm lo choosaaru. Ippudu Netflix lo choodandi 🎬😎
Guntur Kaaram, coming to Netflix on 9 February in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi.#GunturKaaramOnNetflix pic.twitter.com/VL5Rb4Wioj— Netflix India South (@Netflix_INSouth) February 4, 2024
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'సైంధవ్' ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమాతో పాటు సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం కూడా మరికొద్ది రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ మొదలుపెట్టేనుంది. ఇక ఈ సంక్రాంతికి విడుదలైన హనుమాన్, నా సామిరంగా సినిమాలు కూడా మరికొద్ది రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ తో ప్రేక్షకులను అలరించనున్నాయి.
Also read: TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!
Also read: Kumari Aunty Food Point: కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. నెట్టిజన్ల ప్రశంసలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook