Sankranthi Releases 2024: మహేష్ బాబుకు సైతం నష్టమే... తలనొప్పిగా మారిన సంక్రాంతి సినిమాలు

Guntur Kaaram: కొత్త సంవత్సరం వచ్చింది.. ఇక దీనితోపాటు మరికొద్ది రోజుల్లో సంక్రాంతి సంబరాలు కూడా మొదలవుతాయి. సంక్రాంతి అంటేనే సినిమా లవర్స్ కి పండగ వాతావరణం .. ఎందుకంటే థియేటర్స్ కొత్త సినిమాలతో కళకళలాడుతాయి. అయితే ఈసారి సంక్రాంతి బరిలో 8 సినిమాల వరకు పోటా పోటీగా విడుదల కాబోతున్నాయి. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న, థియేటర్లు సరిపోకపోయినా, డి అంటే డి అంటూ తగ్గేదే లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2024, 09:30 AM IST
Sankranthi Releases 2024: మహేష్ బాబుకు సైతం నష్టమే... తలనొప్పిగా మారిన సంక్రాంతి సినిమాలు

Mahesh Babu: ఈ నేపథ్యంలో ఈ కాంపిటీషన్ ఎవరికి లాభదాయకం.. ఎవరికి నష్టం అన్న విషయంపై చర్చలు జోరుగా జరుగుతున్నాయి. మరోపక్క ఇటువంటి పరిస్థితి ఏ సినిమాకు మంచిది కాదు అని కామెంట్ చేసేవారు ఉన్నారు. మొత్తానికి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూసి సీనియర్ నిర్మాతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలు అన్నిటిలోకి భారీ హైప్ మధ్య వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్నా కానీ ప్రస్తుతం ఈ చిత్రానికి కూడా సంక్రాంతి పోటీ తలనొప్పిగా మారుతుంది.

గుంటూరు కారం జనవరి 12న విడుదలవుతోంది కాబట్టి సుమారు 90% థియేటర్లు దీనికి కేటాయిస్తారు అనుకున్నా, మరుసటి రోజు వెంటనే 30% వరకు థియేటర్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్ చిత్రాలు ఆల్రెడీ థియేటర్లను బ్లాక్ చేసుకున్నాయి. కాబట్టి జనవరి 13 అవి రిలీజ్ అయ్యే సమయానికి ఆ థియేటర్లలో గుంటూరు కారం ఆడే అవకాశం ఉండదు. ఇక ఆ తరువాత జనవరి 14న నాగార్జున నా సామిరంగా మూవీ తన వాటా పది శాతం థియేటర్లను తీసుకుంటుంది. హనుమాన్, సైంధవ్, ఈగిల్, నా సామిరంగా మూవీస్ 10 శాతం చొప్పున థియేటర్ల ఆక్యుపెన్సి మెయింటైన్ చేసిన గుంటూరు కారం 60 శాతంతో సరిపెట్టుకోవాలి.

ఈ నాలుగు చిత్రాలలో ఏదైనా ఒకటి మరీ డిజాస్టర్ అయితే తప్ప తొలివారం థియేటర్ కాళీ అయ్యే అవకాశం లేదు. పండగ వాతావరణం పైగా సెలవులు.. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చే టైం కావడంతో ప్రతి మూవీ ఎంతో కొంత ఆక్యుపెన్సే ని మైంటైన్ చేస్తుంది. మొదటివారం కాస్త సర్దుకుంటే మలివారం నుంచి కొద్దిగా థియేటర్లు ఎక్కువ వచ్చే ఛాన్స్ గుంటూరు కారం చిత్రానికి ఉంది. ఇక ఈ నాలుగు చిత్రాలలో ఏ రెండు హిట్ అనిపించుకున్నా ..ఆ ప్రభావం గుంటూరు కారం కలెక్షన్స్ పై ఖచ్చితంగా పడుతుంది. సినిమా మరీ బ్లాక్ బస్టర్ అయితే మల్టీప్లెక్స్ లో కాస్త షోలు పెరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా గుంటూరు కారం సినిమాకి యావరేజ్ స్టాక్ వచ్చి మిగతా ఏవన్నా సినిమాలకు సూపర్ హిట్ దాకా వస్తే మాత్రం మహేష్ బాబుకి తీవ్ర కష్టాలు తప్పవు.

అంతే కాదు ఈ లెక్కలన్నీ చూసుకుంటే.. సంక్రాంతి మూవీస్ పోటీ కారణంగా..కలెక్షన్స్ పరంగా పెద్ద లాభపడేది లేదు అని అర్థం అయిపోతుంది. అందుకే ఇంత పోటీ అవసరమా అని సీనియర్ ప్రొడ్యూసర్లు కూడా కామెంట్ చేస్తున్నారు. 

మరోపక్క నార్త్ ఇండియాలో విడుదల అవుతుంది కాబట్టి హనుమాన్ ఇక్కడ కూడా అదే టైం కి వస్తోంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంటే..ఈగిల్, నా సామి రంగా చిత్రాలు మాత్రం పూర్తిగా హీరోల ప్రెషర్ కారణంగానే సంక్రాంతికి వస్తున్నాయని టాక్. మరి ఈ సంక్రాంతి పోటీ ఎవరిని ఎంతవరకు గెలిపిస్తుందో తెలియదు కానీ మహేష్ బాబుకు మాత్రం తలనొప్పి తెచ్చిపెడుతోంది.

Also Read: Yatra 2 Movie: యాత్ర-2 టీజర్‌ వచ్చేస్తోంది.. పోస్టర్ రిలీజ్

Also Read: Petrol And Oil Tankers: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల సమ్మె విరమణ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News