Mahesh Babu - Guntur Kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన మూవీ మూవీ 'గుంటూరు కారం'. గతంలో వీళ్ల కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అందులో అతడు మూవీ క్లాసిక్‌గా నిలిస్తే.. ఖలేజా మూవీ సిల్వర్ స్క్రీన్ పై కాకుండా స్మాల్ స్క్రీన్ పై సూపర్ హిట్టైయింది. దీంతో గుంటూరు కారం మూవీపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.కానీ ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ కొంత దెబ్బ కొట్టింది. అది వసూళ్లపై ప్రభావం చూపించింది.
గుంటూరు కారం మూవీకి మొదటి రోజు మహేష్ బాబు ఇమేజ్‌తో పాటు త్రివిక్రమ్ స్టార్ డమ్ వంటివి ఈ సినిమాకు బాగానే కలిసొచ్చాయి. దీంతో ఈ సినిమా మంచి కలెక్షన్స్‌నే రాబట్టింది.అంతేకాదు రూ. 90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో నాన్ ప్యాన్ ఇండియా క్యాటగిరిలో హైయ్యెస్ట్ ఫస్ట్ డే వసూళ్లను సాధించిన చిత్రంగా గుంటూరు కారం మూవీ రికార్డులకు ఎక్కింది.మరోవైపు ఈ సినిమాకు పోటీగా విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం గుంటూరు కారం సినిమాకు మైనస్‌గా మారింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ సినిమా దూకుడును సైతం తట్టుకుంటూ ఓన్లీ మహేష్ బాబు ఇమేజ్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది. మరోవైపు ఈ సినిమాకు ఈ ఫలితం రావడంపై అందరు గురూజీ (త్రివిక్రమ్) వైపు వేలెత్తి చూపెడుతున్నారు.
బిగ్ స్టార్ హీరోను పెట్టుకొని కేవలం సింగిల్ లైన్ పాయింట్ తో ఈ సినిమాను చుట్టేసాడనే చెడ్డ పేరు త్రివిక్రమ్‌కు వచ్చింది. తల్లితో కుమారుడికి ఎలాంటి సంబంధం లేదంటూ ప్రామిసరి నోట్ రాసి ఇవ్వడంపైనే ఈ సినిమా స్టోరీని నడింపించాడు. అందులో మహేష్ బాబు మాస్ క్యారెక్టర్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ క్యారెక్టర్‌ను రాసుకున్నాడు త్రివిక్రమ్. అంతేకాదు మహేష్ బాబును కొత్తగా చూపించడంతో పాటు పోకిరి తరహాలో వింటేజ్ లుక్ పై పెట్టిన శ్రద్ధ కథ, కథనాలపై పూర్తిగా కేటాయించ లేకపోయాడు మాటల మాంత్రికుడు. మొత్తంగా త్రివిక్రమ్ ఈ సినిమాను మహేష్ బాబు ఇమేజ్ను నమ్ముకునే తెరకెక్కించాడు. ఆయన నమ్మకాన్ని మహేష్ బాబు నిలబెట్టాడు.మొత్తంగా పండగ సీజన్లో ఇలాంటి టాక్‌తో ఈ సినిమా దాదాపు 90 శాతం వరకు రికవరీ సాధించడం వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు ఇమేజ్‌తో పాటు పండగ సీజన్ కూడా కలిసి వచ్చింది.
ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందు కుర్చీ మడతపెట్టి సాంగ్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేయించడంపై నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. కానీ విడుదల తర్వాత అదే ఈ సినిమాకు ప్లస్‌గా మారింది. ఈ పాటలో మహేష్ బాబు.. శ్రీలీలతో కలిసి వేసిన స్టెప్పులతో థియేటర్స్ అదిరిపోయాయి. ఇప్పటికే విడుదలై ఈ పాట ఫుల్ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి 'మావ ఎంతైనా' అనే పాటను విడుదల చేసారు.
గుంటూరు కారం థియేట్రికల్‌గా అంతగా వర్కౌట్ కాకపోవడానికి పెద్ద కారణమే ఉంది. ఈ మూవీ ప్రీమియర్స్ రోజునే కొన్ని చోట్ల HD ప్రింట్స్ బయటకు రావడం ఈ సినిమాకు మైనస్‌కు మారింది. అది కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్ల విషయానికొస్తే..ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 120 కోట్ల షేర్.. (రూ. 200 కోట్ల గ్రాస్) వరకు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు కారం సినిమా థియేట్రికల్‌గా రూ. 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్డర రూ.15 కోట్లకు అటు ఇటుగా ఆగిపోయింది. ఏది ఏమైనా నెగిటివ్ టాక్‌తో గుంటూరు కారం సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు.
Also read: AP Assembly Budget Session 2024: ఇవాళ్టి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఎన్నిరోజులంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook