Megastar Chiranjeevi Clarity on his Political Dialouge: కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఖాతా నుంచి ఒక 10 సెకండ్ల ఆడియో విడుదల చేశారు. ఆ ఆడియోలో నేనేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నా అంతే.. రాజకీయం నానుంచి దూరం కాలేదు అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ దెబ్బతో ఒక్కసారిగా టాలీవుడ్ లో కలకలం సృష్టించినట్లయింది. టాలీవుడ్ లోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా మెగాస్టార్ రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవుతున్నారా అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
నిజానికి మెగాస్టార్ చిరంజీవి 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పేరుతో ఒక పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల రంగంలోకి దిగారు. అయితే అనూహ్యంగా 294 స్థానాలుకు గాను కేవలం 18 స్థానాల్లో మెగాస్టార్ చిరంజీవి పార్టీకి చెందిన ప్రజారాజ్యం అభ్యర్థులు గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో వైయస్సార్ మరణించిన తర్వాత చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తర్వాత చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యారు.
కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీరిపోయే సమయానికి రాష్ట్ర విభజన జరగటం, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ బలహీన పడటంతో చిరంజీవి కూడా పూర్తిగా రాజకీయాలకు దూరమై సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన రాజకీయాలు తనకు దూరం అయ్యాయి నేను రాజకీయాలకు దూరం కాలేదు అంటూ చేసిన ట్వీట్ తో ఒక్కసారిగా కలకలం రేగిం. అయితే ఆయన గాడ్ ఫాదర్ సినిమాలో ఒక పొలిటికల్ లీడర్ గా కనిపిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఈ ఆడియో బిట్ రిలీజ్ చేసి ఉండవచ్చని కొంత అంచనాలు వెలువడ్డాయి కానీ దాని మీద మాత్రం అధికారిక కన్ఫర్మేషన్ ఇప్పటివరకు లేదు. తాజాగా యాంకర్ శ్రీముఖితో మెగాస్టార్ చిరంజీవి ప్రైవేట్ జెట్ లో చేసిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆయన నా డైలాగ్ ప్రకంపనలు సృష్టిస్తుందనుకోలేదని, ఇది కూడా ఒక రకంగా మంచిదేనని అన్నారు.
రాజకీయాలకు దూరంగా ఉన్నా..కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదని మళ్లీ మరోమారు పేర్కొన్నార. దీంతో చిరు ఎప్పటికైనా మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని ఆశలను సజీవంగా ఉంచినట్లే చెప్పాలి. మరి చూడాలి ఆయన రాజకీయాల్లోకి వెళ్లి ఇస్తారా లేక ఇలా ఆసక్తికరమైన ప్రకటన ఇవ్వడానికే పరిమితం అవుతారా అనేది. ఇక ఆయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన విడుదలవుతోంది. సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార, సునీల్, పూరి జగన్నాధ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్- సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి నిర్మిస్తున్నారు.
Also Read: Brahmastra Ticket Rates: టికెట్ల రేట్లు మళ్లీ తగ్గించిన బ్రహ్మాస్త్ర యూనిట్.. ఇక మూడు రోజులు టికెట్ రేట్లు ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook