Shyam Singha Roy trailer : నాని శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ వచ్చేసింది..దుమ్ములేపాడుపో

Shyam Singha Roy trailer out now : శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజైన టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న శ్యామ్ సింగరాయ్ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా శ్యామ్‌సింగరాయ్‌ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ ఎంతో ఆకట్టుకుంటోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 08:32 PM IST
  • శ్యామ్ సింగరాయ్ మూవీ ప్రమోషన్స్ వేగవంతం
  • శ్యామ్‌సింగరాయ్‌ నుంచి ట్రైలర్ రిలీజ్
  • ఆకట్టుకుంటున్న ట్రైలర్
 Shyam Singha Roy trailer : నాని శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ వచ్చేసింది..దుమ్ములేపాడుపో

Nani's Shyam Singha Roy trailer out now : రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న మూవీ శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy). ఇందులో నాని సరసన సాయి పల్లవి (Sai Pallavi), కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నాని రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజైన టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న శ్యామ్ సింగరాయ్ మూవీ రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ మూవీ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది మూవీ యూనిట్.

తాజాగా శ్యామ్‌సింగరాయ్‌ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ (Shyam Singha Roy trailer) అయ్యింది. ట్రైలర్ ఎంతో ఆకట్టుకుంటోంది.

నాని డబుల్ రోల్ అదిరిపోయింది. ట్రైలర్ చూస్తుంటే.. నాని నుంచి ఫ్యాన్స్ కోరుకునే ప్రతిదీ ఈ మూవీలో ఉన్నట్లు అనిపిస్తోంది. నాని చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. వాడి గుడిసె జోలికి వెళ్లావో.. నీ ఇళ్లు ఎక్కడుందో నాకు బాగా తెలుసు అంటూ నాని చెప్పే డైలాగ్ అదుర్స్. శ్యామ్ సింగరాయ్ పాత్రలో నటన దుమ్ము రేగిపోయింది. వాసు పాత్రలో రొమాన్స్ కూడా అదరగొట్టేశాడు నాని. సినిమా డైరెక్టర్‌‌ గా వాసు పాత్రలో నాని చేసిన సీన్స్ అదిరిపోయాయి. ఇక ఇవాళ వరంగల్‌లో శ్యామ్‌ సింగరాయ్‌ రాయల్‌ ఈవెంట్‌ (Royal Event Of Shyam Singha Roy) పేరుతో రంగలీల మైదానంలో.. శ్యామ్‌ సింగరాయ్‌ (Shyam Singha Roy function)వేడుక కూడా కొనసాగుతోంది. 

 

 

Also Read : BheemlaNayak : భీమ్లా నాయక్ నుంచి క్రేజీ అప్‌డేట్.. రానా డైలాగ్‌లు చింపేశాడు..

ఈ మూవీని నిహారిక ఎంటర్‌‌టైన్‌మెంట్స్ పై (Niharika Entertainment) వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ మూవీకి మిక్కీ జె మేయర్‌ (Mickey J Meyer) మ్యూజిక్ అందించారు. ఈ మూవీ ఓ అద్భుతమైన ప్రేమకథతో తెరకెక్కింది. మూవీలో చాలా భాగం 1970ల కాలం నాటి కోల్‌కతా బ్యాక్‏డ్రాప్‏లో రూపొందింది. మొదట ఈ ట్రైలర్ లాంచ్ కాస్త ఆలస్యమైంది. తర్వత ట్రైలర్ రిలీజైంది.

 

Also Read : ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది.. చిరు సార్ నమ్మకాన్ని నిలబెడుతా: వెంకీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News