హిందీ సూపర్ హిట్ మూవీ అంధాధున్ ( Hindi movie Andha Dhun ) తెలుగు రీమేక్ హక్కుల్ని హీరో నితిన్ గతంలోనే దక్కించుకున్నారు. దర్శకుడిగా మెల్రపాక గాంధీని నిర్ణయించుకున్న నితిన్...ఇప్పుడు టాబూ పాత్రధారి కోసం అణ్వేషణలో ఉన్నాడు.
అంధాధున్ మూవీ ( Andha Dhun ) లో సినిమా మొత్తం టాబూ పాత్ర ( Tabbu Role ) చుట్టూనే తిరుగుతుంది. టాబూది సినిమాలో కీలకమైన రోల్. అందుకే ఇప్పుడు తెలుగు రీమేక్ ( Andha Dhun Telugu remake ) లో టాబూ పాత్రధారిని ఎంపిక చేయడం ఓ సవాలుగా మారింది. ఇప్పటికే ఇలియానాను టాబూ పాత్ర కోసం సంప్రదిస్తే..ఆమె సున్నితంగానే తిరస్కరించిందట. ఆ తరువాత మరి కొన్నిపేర్లను పరిశీలించినా ఏవీ నిర్ధారణ కాలేదు. తాజాగా నయనతార ( Nayanatara ) ను సంప్రదించారు. నేరుగా నితిన్ ( Nithin ) ఆమెతో మట్లాడుతున్నాడు ఆమెతో ఈ విషయంలో. నయనతారకు టాబూ పాత్ర పోషించడం ఇష్టమే కానీ పారితోషికం సమస్యగా మారింది.
మూవీను బట్టి, హీరోను బట్టి, పాత్రను బట్టి ఆమె పారితోషికం నిర్ణయిస్తుంటుంది సాధారణంగా. పెద్ద స్టార్ హీరో సినిమా అయితే గ్లామర్ రోల్ కు 2 కోట్లైనా సరే అంగీకరించేస్తుంది. లేడీ ఓరియెంటేటెడ్ అయితే 4 కోట్లు డిమాండ్ చేస్తుంటుంది. ఇప్పుడు అంధాధున్ కు ఎక్కువే డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడీ విషయంలోనే ఆమెతో బేరసారాలు జరుగుతున్నాయి. Also read: Sushant case: సుప్రీంలో పిటీషన్ వేసిన రియా చక్రవర్తి
టాబూ పాత్రకు నయనతార అయితే మరింత ఆకర్షణ రావడమే కాకుండా మూవీకు క్రేజ్ పెరుగుతుంది. అందుకే నిర్మాతలు ( Makers ) ఆమెను ఎలాగోలా ఒప్పించే పనిలో పడ్డారు. Also read: Murder movie ఆపాలంటూ కోర్టులో పిటిషన్