Pawan Kalyan OG: నిన్న.. మొన్నటివరకు.. తన రాజకీయ పనులతో తెగ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. మరి కొద్ది రోజుల్లో సినిమా షూటింగ్స్ మొదలుపెట్టనున్నాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలు అన్నిటిలో.. సాహో దర్శకుడు సుజిత్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజి చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాని ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తాము అని ఆల్రెడీ నిర్మాతలు అనౌన్స్మెంట్ కూడా చేశారు.
ఈ సినిమా కోసం పవన్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఒక అప్డేట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఓ గ్యాంగ్‌స్టర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా భజే వాయువేగం సినిమా ప్రమోషన్స్ లో సుజీత్ పాల్గొని OG సినిమా గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలోని ఓ సీన్ గురించి తెలిపి పవన్ మరోసారి మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నారని తెలిపాడు. పవన్ కళ్యాణ్ తమ్ముడు.హ ఖుషి లాంటి సూపర్ హిట్ సినిమాలలో మార్షల్ ఆర్ట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వచ్చిన జానీ చిత్రంలో కూడా ఇది ఫాలో అయిన.. ఆ ఒక్క సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. కానీ అంతకుముందు పవన్ మార్షల్ ఆర్ట్స్..చేసిన సినిమాలు చాలావరకు మంచి విజయం సాధించాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఇదే ఫార్మేట్ ఫాలో అవ్వనున్నారు పవన్.
ఈ విషయం గురించి ఈ సినిమా దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ..’ మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైన ఐకిడో ఫైట్ మా చిత్రంలో ఉంది. దాని గురించి చాలానే రీసెర్చ్ చేసాము. ఆ సీన్ గురించి చెప్పాక పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంప్రెస్ అయ్యారు. తన బెస్ట్ ఇవ్వాలని పూణే, ముంబై నుంచి ఐకిడో మాస్టర్స్ ని తీసుకొచ్చి దాన్ని నేర్చుకుంటున్నారు. అలాగే ఐకిడో కి సంబంధించి కొన్ని వీడియోలు, సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చూశారు. దాని గురించి నాతో మరింత చర్చించి సీన్ ని చాలా బాగా వచ్చేలా ఆయన ఎంతో కష్టపడ్డారు. హాఫ్ డేలో అయిపోవాల్సిన ఆ సీన్ ని పవన్ గారు ఇంకా పర్ఫెక్ట్ గా తేవాలని మూడు రోజులు షూట్ అయింది. పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఇంట్రెస్ట్ గా అనిపిస్తే అంత తొందరగా వదలరు’ అని చెప్పుకొచ్చారు.
September 27th 🥹🥹 @PKCreativeWorks
#BVVonMay31st @PawanKalyan #TheyCallHimOG pic.twitter.com/1kLsXZWjt5
— PK Cult (@Pk_Jannu) May 26, 2024
Also read: Remal Cyclone Alert: ఇవాళ తీరం దాటనున్న రెమల్ తుపాను, ఏపీలో రెండ్రోజులు వర్షసూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook