Sammelanam: ప్రేమ, ఫ్రెండ్‌షిప్, బ్రేకప్‌లతో..ఓటీటీలో అలరిస్తున్న యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా..

OTT new releases: నిన్న ఓటీటీలో కొత్త తెలుగు సినిమా సమ్మేళనం  అందుబాటులోకి వచ్చింది. ETV Win లో సమ్మేళనం సినిమా విడుదల కాగా.. ఈ సిరీస్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. ప్రేమ, ఫ్రెండ్షిప్, బ్రేకప్ కాన్సెప్తులతో అలరిస్తోంది ఈ సినిమా. పూర్తి వివరాల్లోకి వెళితే..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Feb 21, 2025, 09:50 AM IST
Sammelanam: ప్రేమ, ఫ్రెండ్‌షిప్, బ్రేకప్‌లతో..ఓటీటీలో అలరిస్తున్న యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా..

Sammelanam OTT : ఈ రోజు ఓటీటీలో కొత్త తెలుగు సినిమా విడుదలయ్యింది. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రూపొందిన సమ్మేళనం సినిమా ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌కి వచ్చింది. 

తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా అలరిస్తోంది. థియేటర్ విడుదల లేకుండానే, ఇది నేరుగా ETV Win లో స్ట్రీమింగ్ అవ్వడం విశేషం. ప్రేమ, ఫ్రెండ్‌షిప్, బ్రేకప్‌లతో కూడిన కథాంశంతో.. ఈ చిత్రం సాగుతుంది. ప్రియ వడ్లమాని, గానాదిత్య, వినయ్ అభిషేక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తరుణ్ మహదేవ్ దర్శకత్వం వహించారు.  

ఈ సినిమా కథ విషయానికి వస్తే..రామ్ (గణాదిత్య) ఒక రచయిత. అతను రాసిన పుస్తకానికి విశేషమైన స్పందన లభిస్తుంది. ప్రముఖ పత్రికల్లో రామ్.. అతని పుస్తకం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తారు. ఈ క్రమంలో శ్రేయ (బిందు నూతక్కి), రాహుల్ (శ్రీకాంత్ యాచమనేని), అర్జున్ (విజ్ఞయ్ అభిషేక్), మేఘన (ప్రియా వడ్లమాని) అతనిని కలవడానికి వస్తారు.  

రామ్, అర్జున్ చిన్ననాటి స్నేహితులు. రచయిత కావాలని రామ్ ఆశిస్తే, అర్జున్ అతనికి మద్దతునిస్తుంది. ఆర్థికంగా కూడా అతన్ని ఆదుకుంటాడు. తన కార్యాలయంలో మేఘనను పరిచయం చేసుకున్న అర్జున్, ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ మేఘనను రామ్ కూడా ప్రేమిస్తాడు. ఇక, మేఘన ఎవరిని ప్రేమించింది? ఈ ప్రేమ కథలో ఎలాంటి ప్రతికూలతలు లేకుండా ఈ ముగ్గురి మధ్య దూరం ఎలా ఏర్పడింది? మళ్లీ వారు ఎలా కలిశారు? మేఘన జీవితంలో చార్లీ (శ్రీకాంత్ గుర్రం) పాత్ర ఏమిటి? చివరకు ఎవరు కలిసి జీవితం కొనసాగించారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాలి.

ప్రస్తుత యువతను ఎంతగానో ఆకట్టుకునేలా ఈ సినిమా ఆధ్యాంతం సాగుతుంది. ముఖ్యంగా ఫ్రెండ్షిప్ తో పాటు ప్రేమ, బ్రేకప్ విషయాలు చాలా చక్కగా చూపించడంతో.. ప్రస్తుత తరం వారు ఈ సినిమాకి బాగా కనక్ట్ అవుతారు. మీకు ఎలాంటి విలన్ లేని ట్రయాంగిల్ ప్రేమ కథలు ఇష్టమైతే ఈ సినిమాని ఒకసారి చూసేయని.

Also Read: Champions Trophy 2025 Ind Vs Ban: శుభమన్‌ గిల్‌ సెంచరీ.. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ విజయం

Also Read: Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన షమీ, హృదయ్‌.. భారత లక్ష్యం 229

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News