Bheemla Nayak Postponed: సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న పవర్ స్టార్.. భీమ్లా నాయక్ రిలీజ్ వాయిదా

Bheemla Nayak Postponed: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'భీమ్లా నాయక్'. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కావాల్సిఉంది. అయితే ఇప్పుడీ చిత్ర విడుదల వాయిదా పడింది. రెండు పాన్ ఇండియా సినిమాల విడుదల నేపథ్యంలో విడుదల వాయిదా వేయడానికి చిత్రబృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2021, 12:50 PM IST
    • సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్
    • వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు సమాచారం
    • ఇదే విషయాన్ని ప్రకటించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు
Bheemla Nayak Postponed: సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న పవర్ స్టార్.. భీమ్లా నాయక్ రిలీజ్ వాయిదా

Bheemla Nayak Postponed: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' (Bheemla Nayak Movie) చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల రిలీజైన టైటిల్ సాంగ్ రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తోంది. అయితే.. ఈ సినిమా సంక్రాంతి బరినుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. 

వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ చిత్రం (Bheemla Nayak Release Date) థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది. 

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. అతడిని ఢీ కొట్టే పవర్ ఫుల్ పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. నిత్యామేనన్, సంయుక్త మేనన్.. కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

సంక్రాంతి రేసులో..

ప్రస్తుతం సంక్రాంతి రేసులో 'ఆర్ఆర్ఆర్' (జనవరి 7), 'రాధేశ్యామ్' ( జనవరి 14) ఉన్నాయి. 'బంగార్రాజు' (జనవరి 15-ఖరారు కాలేదు) ఉన్నాయి. మహేష్ బాబు 'సర్కారు వారిపాట' చిత్రాన్ని కూడా మొదట జనవరి 13న విడుదల చేయాలని భావించింది చిత్రబృందం. కానీ కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది.   

Also Read: Samantha: 'పుష్పరాజ్‌గా బన్నీ అదరగొట్టేశారు..ఆయనను స్పూర్తిగా తీసుకుంటా'..: సమంత

Also Read: Radhe Shyam: ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్క్రీన్‌లో రాధే శ్యామ్ స్పెషల్ షో.. ఎక్కడో తెలుసా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News