Kalki 2898 AD interesting facts: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ ముఖ్యపాత్రలో నటించిన కల్కి 2898 AD.. జూన్ 27న విడుదలై.. ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి స్పందన తెచుకుంటోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. వచ్చిన ఈ చిత్రం.. హిందు పురాణాలను.. భవిష్యత్ ఇతివృత్తాలతో కలిపి రాసుకున్న కథతో సాగింది.
కథ విషయానికి వస్తే.. త్రేతా యుగంలో..కురుక్షేత్ర యుద్ధంలో పాండవ నాశనాన్ని కోరుకుని కృష్ణుడి.. మీదే యుద్ధానికి తలపడిన అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్).. కృష్ణుడి నుంచి శాపం పొందుతారు. అందువలన కలియుగం వరకు.. లోకంలో జరిగే దుర్మార్గాలు చూస్తూ అలానే బతికి ఉంటారు. అయితే అశ్వద్ధామకు.. కృష్ణుడు తాను మళ్ళీ కలియుగం..అంతంలో పుడతానని.. అప్పుడు తనని అతనే రక్షించాలని తెలుపుతారు. ఇక ఆరు వేల సంవత్సరాల తర్వాత ప్రపంచంలోకెల్లా విలాసవంతమైన కాంప్లెక్స్ లో అడుగు పెట్టేందుకు.. యూనిట్స్ కోసం ఏవేవో పనులు చేస్తుంటాడు భైరవ (ప్రభాస్). మరోపక్క సమస్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న యాస్కిన్(కమల్ హాసన్) తన మనుషుల ద్వారా.. అరుదైన గర్భాన్ని మోస్తున్న సుమతి (దీపికా పదుకునే) కోసం వెతుకుతుంటాడు. చివరికి వీరందరూ శంబళలో కలిసే పరిస్థితి వస్తుంది. దీనికి ముందు తర్వాత జరిగేది అసలు స్టోరీ.
ఇక ఈ కథ వింటేనే.. ఈ కథలో శంబళ అనే ఊరు.. ముఖ్య పాత్ర పోషిస్తుందని అర్థమవుతుంది. అయితే మన ఇతిహాసాలు తెలియని ఎంతోమంది.. ఈ ఊరు కేవలం కల్పితం అనుకున్నారు. కానీ ఈ ప్రదేశానికి మన పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది.
మన ఇతిహాసాల్లోని కల్కి పురాణం ప్రకారం.. కల్కి అవతారం.. శంబళ లో ప్రాణం పోసుకుంటుంది. కల్కి కలియుగ అంతంలో శంబళ నగరం లో జన్మించడం వల్ల.. ఆ ప్రదేశం రూపురేఖలు మారిపోయి ఉంటాయి.సరస్సులు, సరోవాలతో ఎంతో అందంగా అహ్లాదకరంగా.. ఆ ప్రదేశం మారిపోతుంది. కానీ పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కీ అక్కడ అధర్ములను.. సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ క్రమంలో దేవతలు శంబళకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. ఇదంతా ముగిసిన తరువాత.. కల్కి తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కీ.. సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కీ అవతారం చాలిస్తాడు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబళ అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా.. అదృశ్యమవుతుంది.
ఇంత కథ ఉన్న ఈ ప్రదేశం గురించి నాగ్ అశ్విన్ కలిగే సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ సినిమా ద్వారా మన ఇతిహాసాల పైన.. మనకి ఒక తెలియని ఇంట్రెస్ట్ పెరిగింది అన్నడంలో ..అతిశయోక్తి లేదు.
Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..
Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి