Prabhas - Salaar: సలార్ హిందీ వెర్షన్ టోటల్ కలెక్షన్స్.. మైండ్ బ్లాంక్ అంతే..

Prabhas - Salaar: బాహుబలి సినిమాతో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని ప్రభాస్.. రీసెంట్‌గా విడుదలైన 'సలార్' మూవీతో మళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. ఇప్పటికే ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి సంబంధించిన థ్రియేట్రికల్ రన్ ముగిసింది. ఈ నేపథ్యంలో సలార్ మూవీ హిందీ వెర్షన్‌లో ఏ మేరకు వసూళ్లను రాబట్టిందో చూద్దాం.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 25, 2024, 02:22 PM IST
Prabhas - Salaar: సలార్ హిందీ వెర్షన్ టోటల్ కలెక్షన్స్.. మైండ్ బ్లాంక్ అంతే..

Prabhas - Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా  నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.పృథ్వీరాజ్ సుకుమారన్ మరో లీడ్ రోల్లో నటించారు. లాస్ట్ ఇయర్ చివర్లో విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుంచే మంచి టాక్‌తో బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. ఇక కన్నడ,ఇతర భాషల్లో పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయింది. అటు హిందీలో కూడా అనుకున్నంత టాక్‌కు తగ్గ వసూళ్లు రాబట్టడంలో విఫలం అయింది. దీంతో ఈ సినిమా పరుగు రూ. 700 కోట్ల వరకే పరిమితమైంది. ఇక సలార్ మూవీ నైజాం (తెలంగాణ) గడ్డపై రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది. గతంలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత మూడో సినిమాగా ఈ మూవీ రికార్డులకు ఎక్కింది. తెలుగులో సంక్రాంతి సినిమాల రాకతో ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. మరోవైపు ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అక్కడ హిందీ, తెలుగు సహా వివిధ భాషల్లో ఈ మూవీ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

మరోవైపు 'సలార్' మూవీ స్పానిష్ భాషలో డబ్ చేసిన మార్చి 7 లాటిన్ అమెరికా దేశాల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు 'సలార్' మూవీని జపాన్‌ దేశంలో సమ్మర్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ విషయానికొస్తే.. ఇద్దరు ప్రాణ స్నేహితులు..శత్రువులుగా ఎలా మారారనే కథాంశంతో తెరకెక్కింది. ఇక సలార్ రెండో పార్ట్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. రెండో పార్ట్‌కు సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనే టైటిల్ ఖరారు చేసారు మేకర్స్. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.

ఈ మూవీ హిందీ వెర్షన్ కలెక్షన్స్ విషయానికొస్తే.. షారుఖ్ హీరోగా నటించిన 'డంకీ' సినిమాతో పోటీ కారణంగా తక్కువ స్క్రీన్స్ దక్కాయి. అయినా.. అక్కడ కూడా మంచి వసూళ్లనే సాధించింది. అక్కడ ఈ మూవీ ఓవరాల్‌గా రూ. 150 కోట్ల నెట్ వసూళ్లతో దుమ్ము దులిపింది. ఓవరాల్‌గా రూ. 153.45 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్టు సమాచారం.

మొత్తంగా సినిమా హిందీలో రూ. 75 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. టోటల్ రన్ ముగిసే సమయానికి హిందీలో రూ. 76.50 కోట్ల రేంజ్‌లో షేర్ సొంతం చేసుకొని హిందీలో హిట్ స్టేటస్ అందుకుంది. ఇక రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 78 కోట్ల బిజినెస్‌కు రన్ కంప్లీట్ అయ్యేవరకు రూ. 80.90 కోట్ల రేంజ్‌ను చేసుకొని సొంతం చేసుకొని పరుగును పూర్తి చేసుకుంది. ఓవరాల్‌గా ఈ మూవీ హిందీ సహా రెస్ట్ ఆఫ్ భారత్‌లో హిట్ అందుకుంది.

ప్రభాస్ ఇతర చిత్రాల విషయానికొస్తే.. ఈయన హీరోగా నటించిన 'కల్కి' మూవీ మే 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దీపికా హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ప్రభాస్ 'రాజా సాబ్' మూవీ చేస్తున్నారు.సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'ది రాజాసాబ్' మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ గా ఈ మూవీ రాబోతున్నటు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్ధమవుతోంది. అటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మూవీలపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇంకోవైపు ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు.

Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News